Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ 9 లో ఉన్న కంటెస్టెంట్స్ లో తనుజ ఒకరు. చాలామందికి తనుజాకి బిగ్ బాస్ యాజమాన్యం సపోర్ట్ చేస్తుంది అనే క్లారిటీ వచ్చింది. ఈ రోజుల్లో ఆడియన్స్ కూడా చాలా తెలివైన వాళ్ళు అని ప్రూవ్ అవుతుంది. ముఖ్యంగా కేవలం తనుజాకి సపోర్ట్ చేయడం కోసమే ఒక గంట ఎపిసోడ్లో చూపించాల్సినవి చూపించకుండా మిగతావి చూపిస్తుంది బిగ్ బాస్ యాజమాన్యం.
కానీ 24 గంటలు స్ట్రీమింగ్ చూసిన వీక్షకులకు ఆల్రెడీ ఒక క్లారిటీ ఉంది. ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు అని అందరికీ తెలిసిపోతుంది. ఇకపోతే తనుజ సేఫ్ గేమ్ ఆడుతున్నట్లు చాలామందికి తెలుసు. అలానే తనుజాకి బిగ్ బాస్ యాజమాన్యం సపోర్ట్ తో పాటు బయట కూడా భారీ స్థాయిలో పిఆర్ నడుస్తుంది అని అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. ఆల్రెడీ తనుజతో ఉన్న బంధం వలనే భరణి బయటకు వెళ్లిపోయాడు అని కామెంట్స్ కూడా వినిపించాయి. శివాజీ ఇంటర్వ్యూలో కూడా భరణిను ఇదే ప్రశ్న అడిగారు. అయితే తన వలన నాకేం ఎఫెక్ట్ అవ్వలేదు అని భరణి సమాధానం చెప్పాడు.
నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా తనుజకు మరియు భరణికి మధ్య విపరీతమైన హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. అయితే మొత్తానికి భరణి తను ఒకసారి బయటికి వెళ్తే తనకి నా సిచువేషన్ ఏంటో అర్థం అవుతుంది అందుకనే ఆమె బయటకు వెళ్లాలని చెప్పి నేను నామినేషన్ చేస్తున్నాను అని క్లారిటీగా చెప్పేసాడు.
మరోవైపు ఇమ్మానుయేల్ కూడా తనుజ ను నామినేట్ చేశాడు. తనుజ రివర్స్లో నాకు ఎవరు సపోర్టు లేకుండానే గేమ్ ఆడాను. ఎవరి సపోర్టు లేకుండానే ఇప్పటివరకు వచ్చాను అని వాదించింది. అయితే ఒకపక్క భరణి, మరో పక్క ఇమ్మానుయేల్ యాంటి అయిపోయారు. అలానే హౌస్ లో ఉండాల్సిన మాదిరి బయటకు వెళ్లిపోయింది. ఇప్పుడు తనుజాకి బంధం కరువు అయింది.
తనుజ హౌస్ లో ఆట ఆడాలి అంటే ఖచ్చితంగా తనకంటూ ఒక సపోర్ట్ ఉండాల్సిందే. ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకోవాలో తనకి బాగా తెలుసు. అందుకే అందరూ వ్యతిరేకం అయిపోవడంతో ఈసారి మాత్రం రాము రాథోడ్ ను ఎంచుకుంది. రాము రాథోడ్ తో ఇప్పుడు తమ్ముడు అనే బంధం నడుపుతుంది.
రాము రాథోడ్ నిన్న కళ్యాణ్ ను నామినేట్ చేశాడు. కళ్యాణ్ ను నామినేట్ చేయమని కూడా తనుజ చెప్పింది. వీడియోలో సరిగ్గా అబ్జర్వ్ చేస్తే కళ్యాణ్ ను నామినేట్ చేయమని తనుజ సీక్రెట్ గా రాము రాథోడ్ చేతి పైన రాసింది.
Also Read: Ram Charan: ఆ బాలీవుడ్ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా, ఈసారి హిట్ ఖాయం