Sai Durgha Tej : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కేవలం మెగా ఫ్యామిలీ లోనే దాదాపు పదిమందికి పైగా హీరోలు ఉన్నారు. వారిలో మంచి సక్సెస్ సాధించిన వాళ్లు మాత్రం కేవలం రామ్ చరణ్ మాత్రమే అని చెప్పాలి. వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్ వీరిద్దరూ కూడా వరుసగా సినిమాలు చేసినా కూడా సక్సెస్ కంటే కూడా ఫెయిల్యూర్ సినిమాలు ఎక్కువ చేశారు.
ఇకపోతే వాళ్లు పర్సనల్ గా ఉండే విధానం వలన చాలామంది వాళ్లను ఇష్టపడుతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో వాళ్లు మాట్లాడే విధానానికి కూడా చాలామంది అభిమానులు కనెక్ట్ అవుతారు. ఇకపోతే ప్రస్తుతం సాయి దుర్గ తేజ్ చేసే సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధిస్తున్నాయి. విరూపాక్ష సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సాధించుకున్నాడు. ప్రస్తుతం సంబరాలు ఏటిగట్టు అనే మరో పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ఇకపోతే రీసెంట్ గా సాయి ధరంతేజ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. స్టార్డం అంటే ఆ హీరోతో సెల్ఫీలు దిగడం కాదు. ఆ హీరో నటించిన సినిమా పోస్టర్ తో సెల్ఫీలు దిగడం. అది అసలైన స్టార్డం అంటే నేను దానికోసమే ప్రయత్నిస్తున్నాను అని సాయి దుర్గ తేజ్ రీసెంట్ గా చెప్పారు.
సాయి దుర్గ తేజ మాట్లాడిన మాటలు కూడా వాస్తవం అని ఒప్పుకోవాలి. అంటే ఆ రేంజ్ సక్సెస్ సాధించాలి అనే ఆలోచన ఉండటం అనేది మంచిది. ఆ రేంజ్ సక్సెస్ సాధించాలంటే కథలు ఎన్నుకునే విషయాల్లోనూ కూడా సరైన క్లారిటీ ఉండాలి. ఈ రోజుల్లో ఒక గొప్ప సినిమా వస్తే కానీ ప్రేక్షకులు ఆ సినిమాకి బ్రహ్మరథం పట్టడం లేదు. ప్రేక్షకులకు నచ్చే సినిమా చేయడం అనేది ఈ రోజుల్లో ఒక పెద్ద టాస్క్ అయిపోయింది.
అందుకే స్టోరీస్ సెలక్షన్స్ విషయంలోనూ కూడా జాగ్రత్త వహించాలి. మంచి కంటెంట్ ఉన్న సినిమా వస్తే ఎప్పుడూ ఆదరిస్తాం అని చెప్పడంలో తెలుగు ప్రేక్షకులు ముందుంటారు. అందుకే మిగతా భాష సినిమాలో కూడా ఇక్కడ మంచి సక్సెస్ సాధించాయి. ఆ నటులను కూడా విపరీతంగా తెలుగు ప్రేక్షకులు ఇష్టపడతారు.
సాయి తేజ్ ఇచ్చిన స్టేట్మెంట్ చాలా పెద్దది. సాయి తేజ్ ఆ స్థాయికి వెళ్ళాలి అంటే అద్భుతమైన సినిమాలు చేయాలి. ఎందుకంటే కొంచెం కష్టపడితే ఎవరైనా కూడా సాయిధరమ్ తేజ్ దగ్గరికి వెళ్లి ఫోటో తీసుకోవచ్చు ఈ రోజుల్లో. కానీ పోస్టర్ తో ఫోటో దిగడం అంటే ఆ స్టార్ హీరో ఎవరికి అందుబాటులో ఉందని స్థాయికి వెళ్లిపోవడం.
విరూపాక్ష సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు సాయి. ఇక సంబరాలు ఏటిగట్టు సినిమా ఏ స్థాయిలో ఉంటుందో రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. ఆ తర్వాత కూడా సినిమా కథలను ఎంచుకునే విధానంలో క్లారిటీ ఉంటేనే సాయి తేజ్ కల కూడా నిజం అవుతుంది.
Also Read: Ram Charan: ఆ బాలీవుడ్ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా, ఈసారి హిట్ ఖాయం