US Shutdown 2025: అమెరికాలో ప్రభుత్వ షట్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీని ప్రభావం అమెరికాలోని ప్రతి పౌరుని పైన పడుతోంది. తాజాగా విమానాలపై కూడా ఈ అమెరికా ప్రభుత్వ షట్ డౌన్ ( US Shutdown 2025) పడింది. దీని కారణంగా విమానాశ్రయంలో విమానాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దేశవ్యాప్తంగా వేలాది విమానాలు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో, విమానాశ్రయాలలో భద్రత తనిఖీల కోసం ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి కూడా నెలకొంది. సిబ్బంది కొరత కారణంగా విమానాశ్రయాలలో ప్రయాణికులు ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇక తాజాగా వాషింగ్టన్ DC లోని ( Washington DC ) రోనాల్డ్ రీగన్ విమానాశ్రయంలో ( Ronald Reagan airport) భద్రత సమస్యల కారణంగా విమానాలను నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు అంతా విమానాశ్రయంలోనే చిక్కుకున్నారు. అమెరికాలో ఇలా విమానాలు ఆగిపోవడం, ఆలస్యంగా రావడంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
అమెరికా లాంటి అగ్ర రాజ్యంలో కాంగ్రెస్ నిధుల బిల్లును ఆమోదించకపోతే.. వెంటనే ఫెడరల్ సేవలు నిలిచిపోతాయి. దీన్నే గవర్నమెంట్ షర్ట్ డౌన్ ( US Shutdown 2025 ) అంటారు. ప్రస్తుతం అగ్రరాజ్యమైన అమెరికాలో ఈ షట్ డౌన్ కొనసాగుతోంది. నిధుల విడుదలపై పాలక రిపబ్లికన్స్ అలాగే ప్రతిపక్ష డెమోక్రంట్ల మధ్య విభేదాలు ముదిరిపోయాయి. దీంతో ప్రభుత్వ విభాగాలు మొత్తం స్తంభించిపోయాయి. దాదాపు 33 రోజులుగా అమెరికాలో ఈ షట్ డౌన్ కొనసాగుతోంది. దీని కారణంగా చాలా మంది ఉద్యోగులకు జీతాలు కూడా రాలేదు. ఈ షట్ డౌన్ అనేది అమెరికన్లపై బాగా ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. దాదాపు 5 కోట్ల మంది అమెరికాకు చెందిన ప్రజలకు అందించే ఆహార సబ్సిడీ కార్యక్రమాలు కూడా నిలిచిపోనున్నాయట.
అమెరికాలో ( America) షట్ డౌన్ మొదలైనప్పటి నుంచి దారుణమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. మొన్న ఆదివారం అయితే ఏకంగా 5వేలకు పైగా విమానాలు ఆలస్యంగా నడిచినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం అయితే 2600 కు పైగా అభిమానాలు ఆలస్యంగా నడిచాయట. ఇందులో 60 కి పైగా సర్వీసులు పూర్తిగా రద్దు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. అమెరికాలో షట్ డౌన్ కారణంగా విమానాశ్రయాలలో పనిచేసే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, ఇతర సిబ్బంది జీతాలు లేకుండా పనిచేస్తున్నారట. దానివల్ల ఆర్థిక భారం విపరీతంగా పెరగడం జరుగుతుంది. ఆర్థిక భారం పెరగడంతో ఉద్యోగాలు మానేశారట. దీంతో ఉద్యోగుల కొరత కారణంగా ప్రయాణికుల చెకప్ ఆలస్యం అవుతోంది. తద్వారా విమానాశ్రయాల్లో విమానాలు ఆలస్యంగా ప్రయాణిస్తున్నాయి. కాగా అమెరికా ఇప్పటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల ( Air traffic controllers ) కొరత ఉందట. ఇలా అనేక సమస్యలను అమెరికా ఎదుర్కొంటోంది.