Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యంగ్ డైరెక్టర్స్ తో వరుసగా సినిమాలు చేయడం మొదలు పెడుతున్నారు. ఖైదీ నెంబర్ 150 సినిమా తర్వాత మెగాస్టార్ సినిమాలు చేయడంలో తన స్పీడ్ పెంచారు. అయితే ఎన్ని సినిమాలు చేసినా కూడా యంగ్ డైరెక్టర్ బాబి దర్శకత్వంలో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా అభిమానులకు ఎక్కువ కిక్ ఇచ్చింది. ఎంటర్టైన్మెంట్ తో పాటు అద్భుతమైన కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఆ సినిమాలో డిజైన్ చేశాడు.
ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ గారు అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పటాస్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన అనిల్ రావిపూడి ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ కూడా సక్సెస్. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టాడు. ఇప్పుడు మళ్లీ సంక్రాంతి సీజన్ కి మెగాస్టార్ చిరంజీవితో సినిమా సిద్ధం చేస్తున్నాడు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మన శంకరవరప్రసాద్ గారు క్లైమాక్స్ ఫైట్ షూట్ అన్నపూర్ణలో అవుతుంది. ఇంకో 3-4 రోజుల్లో పూర్తి అవుతుంది. ఆ తరువాత ఇంకో రెండు పాటలు షూట్ చేస్తే… మొత్తం షూటింగ్ దాదాపుగా పూర్తి.
మొత్తానికి స్టార్ హీరోతో సంక్రాంతి టార్గెట్ పెట్టుకున్న అనిల్ కేవలం ఏడాదిలోనే సినిమాను పూర్తి చేసి 2026 సంక్రాంతికి సినిమాను సిద్ధం చేస్తున్నాడు. ఇటువంటి దర్శకులు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉండటం చాలా ప్లస్ అవుతుంది.
కొంతమంది స్టార్ హీరోలతో సినిమాలు చేయటానికి రెండు మూడు సంవత్సరాలు తీసుకుంటారు. కానీ అనిల్ మాత్రం 2025 సంక్రాంతికి సక్సెస్ కొట్టి 2026 సంక్రాంతికి మరో సినిమాతో ముందుకు రాబోతున్నాడు. అది కూడా మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరోతో.
మరోవైపు అనిల్ రావిపూడి మొదట సాంగ్స్ తోనే ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి విపరీతమైన క్రేజ్ రావడానికి కారణం గోదారి గట్టు మీద రామచిలకవే అనే పాట. ఇదివరకే మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా నుంచి విడుదలైన మీసాల పిల్ల పాట సూపర్ హిట్ అయింది.
చాలా రోజులు తర్వాత మెగాస్టార్ చిరంజీవికి ఉదిత్ నారాయణ పాటను పాడారు. ఉదిత్ నారాయణ ను ఈ పాట పాడటం కోసం ఎంచుకోవడంలోనే సగం సక్సెస్ అయిపోయాడు అనిల్. పాట కూడా సూపర్ హిట్ అవడంతో సినిమా మీద అంచనాలు ఆల్రెడీ పెరిగిపోయాయి. ఇక సినిమా ఏ స్థాయిలో ఉంటుందో అని చాలామందికి ఫ్యూరియాసిటీ ఇప్పటికే మొదలైంది.
Also Read: Ram Charan: ఆ బాలీవుడ్ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా, ఈసారి హిట్ ఖాయం