Bigg Boss Tamil 9: బిగ్ బాస్ హౌజ్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. ప్రేమలు, గొడవలు అన్ని కామన్. ముఖ్యంగా హౌజ్ లో గొడవల అన్ని సర్వసాధారణమే. చిన్న చిన్న గొడవలు కాస్తా చిలి చిలికి గాలివాన మారి వాదనలు తారాస్థాయికి చేరిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. హౌజ్ లో ఇప్పటి వరకు వాదనలు, వాగ్వాదాలే తప్ప చేయి చేసుకున్న సంఘటనలు లేవు. కానీ, తాజాగా బిగ్ బాస్ హౌజ్ లో గొడవలు మితిమిరి కొట్టుకునేవరకు వెళ్లారు. ప్రస్తుతం తమిళ్ బిగ్ బాస్ తొమ్మిదవ సీజన్ జరుపుకుంటుంది.
తాజాగా తమిళ్ బిగ్ బాస్ ఊహించని సంఘటన చోటు చేసుకుంది. చిన్న చిన్నగా మొదలైన గొడవ ఒకరిని ఒకరు దాడి చేసుకునేవరకు వెళ్లింది. ప్రస్తుతం సంఘటన హాట్ టాపిక్ అయ్యింది. బిగ్ బాస్ తమిళంలోని కంటెస్టెంట్స్ లో కమరుదిన్, ప్రవీణ్ రాజ్ ల మధ్య ఘర్షన చోటుచేసుకుంది. హౌజ్ మాట మాట పెరిగి వీరద్దరు మధ్య పెద్ద ఘర్షణకు దారి తీసింది. అది కాస్తా కొట్టుకునే వరకు వెళ్లింది. ఇద్దరు ఒకరిపై ఒకరు వెళుతూ దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో ఓ కంటెస్టెంట్ కింద పడిపోయాడు. సహా కంటెస్టెంట్స్ వారి దాడిని ఆపేందుకు ప్రయత్నించారు. అయిన ఇద్దరు ఒకరిపై ఒకరు దూసుకువెళుతూ కొట్టుకున్నారు.
దీంతో తమిళ్ బిగ్ బాస్ హౌజ్ లో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. వీరి కొట్టుకోవడం చూసి ఫీమెల్ కంటెస్టెంట్స్ భయంతో వణికిపోయారు. అసలు ఏం జరగుతుందో తెలియ హడలెత్తి పోయారు. వారు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం చూసి ఫీమెల్ కంటెంస్టెంట్స్ ఏడ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారి గొడవ కారణంగా హౌజ్ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో షాక్ ఉన్న అందరికి కమరుదిన్, ప్రవీణ్ రాజ్ లు షాకిచ్చారు. ఇది ప్రాంక్ అని చెప్పి అందరికి షాకిచ్చారు. వారి తీరుతో హౌజ్ తో పాటు నెటిజన్స్ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. చాలా సీరియస్ గా జరిగిన ఈ దాడికి హౌజ్ లోని వారంత బెంబెలెత్తిపోయారు.
#Day30 #Promo1 of #BiggBossTamil
Bigg Boss Tamil Season 9 – இன்று இரவு 9:30 மணிக்கு நம்ம விஜய் டிவில.. #BiggBossTamilSeason9 #OnnumePuriyala #BiggBossSeason9Tamil #BiggBoss9 #BiggBossSeason9 #VijaySethupathi #BiggBossTamil #BB9 #BiggBossSeason9 #VijayTV #VijayTelevision pic.twitter.com/jrFCHSPK8j
— Vijay Television (@vijaytelevision) November 4, 2025
కానీ ఇది కావాలని వారిద్దరు ప్లాన్ చేసి గొడవపడ్డారట. హౌజంతటి ఆటపట్టించేందుకు ఈ ప్రాంక్ ప్లాన్ చేసినట్టు ఫైనల్ కమరుదిన్, ప్రవీణ్ రాజ్ బయటపెట్టారు. దీంతో కొందరు వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. ప్రాంక్ అని ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై నెటిజన్స్ నుంచి రకరకాల స్పందన వస్తున్నాయి. ఇది నిజమని ఈ వీకెండ్ కి హోస్ట్ విజయ్ సేతుపతిలో కమరుదిన్, ప్రవీణ్ రాజ్ కి గట్టి వార్నింగ్ పడుతుందని, హౌజ్ బిగ్ బాస్ నిబంధనలు ఉల్లంఘించినందుకు బిగ్ బాస్ టీం వారిని హౌజ్ నుంచి బయటకు పంపిస్తుందని అనుకున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా వీరిద్దరు తిరుతో నెటిజన్స్ మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.