OTT Movie : యూత్ ని అట్రాక్ట్ చేసే కొన్ని సినిమాలు డిఫరెంట్ స్టోరీలతో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో ఒక వివాహిత జంట, మూడో వ్యక్తిని తమ సంబంధంలో ఆహ్వానిస్తారు. ఆతరువాత స్టోరీ బీభత్సంగా నడుస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘కిస్ మీ అగైన్’ (Kiss me Again). ఈ సినిమాకి విలియం టైలర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జెరెమీ లండన్, కాథరిన్ విన్నిక్, మిరెల్లీ టేలర్, ఎలిసా డోనోవన్ ప్రధాన పాత్రల్లో నటించారు. 1 గంట 43 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకి IMDbలో 4.9/10 రేటింగ్ ను కలిగి ఉంది. ఈ సినిమా ప్లెక్స్ (Plex), అమెజాన్ ప్రైమ్ వీడియో Amazon Prime Video)లో అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
సినిమా జూలియన్, చాలిస్ అనే వివాహిత జంట చుట్టూ తిరుగుతుంది. వీరు మూడు సంవత్సరాలుగా సంతోషంగా, ప్రేమతో జీవిస్తుంటారు. జూలియన్ న్యూయార్క్‌లోని ఒక స్టోర్‌ఫ్రంట్ కాలేజీలో ప్రొఫెసర్‌గా ఉంటాడు. చాలిస్ ప్లాన్డ్ పేరెంట్‌హుడ్‌లో కౌన్సెలర్‌గా పనిచేస్తుంది. వారు లోయర్ ఈస్ట్ సైడ్‌లో ఒక ఫ్లాట్‌లో చాలిస్ అనే స్నేహితురాలు మలికాతో కలిసి నివసిస్తారు. వీళ్ళ వివాహం సంతోషకరంగా ఉన్నప్పటికీ, జూలియన్ తన విద్యార్థి ఎలెనా అనే స్పానిష్ యువతి పట్ల మొహం పెంచుకుంటాడు. అతను ఆమెతో వ్యవహారం నడపకుండా వెనక్కి తగ్గినప్పటికీ, ఈ స్టోరీ కథను ముందుకు నడిపిస్తుంది. జూలియన్ తమ పొరుగువారి నుండి ఒక సీక్రెట్ తెలుసుకుంటాడు. వాళ్ళు ముగ్గురు కలసి లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటారు.
ఈ క్రమంలో జూలియన్ కి ఒక ఐడియా వస్తుంది. తమ వివాహంలో కూడా ముగ్గురు వ్యక్తుల సంబంధం కొనసాగించాలని చాలిస్‌ను ఒప్పించే పథకాన్ని రూపొందిస్తాడు జూలియన్. చాలిస్ మొదట ఇందుకు సంకోచిస్తుంది. కానీ చివరికి ఒప్పుకుంటుంది. జూలియన్, ఎలెనాను ఈ సంబంధంలోకి ఆహ్వానిస్తాడు. చాలిస్‌కు తాను ఎలెనాను ఇప్పటికే తెలుసని చెప్పకుండా దాచిపెడతాడు. ఈ సమయంలో మలికా కూడా ఈ డైనమిక్‌లో పాత్రలో భాగమవుతుంది. ఈ ముగ్గురు వ్యక్తుల మధ్య సంబంధం అనుకోని మలుపులు తిరుగుతుంది. చివరికి ఈ రిలేషన్ ఎలాంటి సంఘటనలకు దారి తీస్తుంది ? ఒకే ఇంట్లో వీళ్ళు ఎలా ఉంటారు ? ఈ స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చుడండి.
Read Also : సడన్ గా వ్యాన్ లోకి ఊడిపడే శవం… డ్రైవర్ కు పిడి… గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్… తెలుగులోనే స్ట్రీమింగ్