Ram Charan: ఏప్పుడొచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అనే డైలాగ్ మహేష్ బాబు పోకిరి సినిమాలో చెబుతాడు. కొంతమంది ఇండస్ట్రీకి దర్శకులుగా పరిచయం అవ్వడానికి కొంత టైం తీసుకోవచ్చు. కానీ వాళ్లు దర్శకులుగా పరిచయమైన తరువాత వాళ్ళ సినిమాతో ఇచ్చే ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో రాజ్ కుమార్ హిరానీ చాలా లేటుగా దర్శకుడు అయ్యాడు. కానీ తాను దర్శకత్వం వహించడం మున్నాభాయ్ ఎంబిబిఎస్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది.
మున్నాభాయ్ ఎంబిబిఎస్ సినిమాని తెలుగులో శంకర్ దాదా ఎంబిబిఎస్ పేరుతో చిరంజీవి రీమేక్ చేశారు. తెలుగులో కూడా ఆ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఆ తర్వాత రాజకుమార్ హీరోని మున్నాభాయ్ లగే రహో అనే సినిమా చేశారు. ఆ సినిమా బాలీవుడ్ లో హిట్ అయింది. తెలుగులో రీమేక్ చేశారు గాని అది ఊహించిన స్థాయిలో ఆడలేదు. అయితే ఇప్పటివరకు రాజ్కుమార్ హీరోని ఆరు సినిమాలు దర్శకుడుగా చేశారు. డంకీ సినిమా ఊహించిన రేంజ్ సక్సెస్ అందుకోలేదు కానీ అన్ని సినిమాలు సూపర్ హిట్.
తెలుగులో రామ్ చరణ్ సూపర్ హిట్ సినిమాలు చేసిన తరువాత బాలీవుడ్ లో జంజీర్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా ఊహించిన రేంజ్ సక్సెస్ సాధించలేకపోయింది. చాలామంది బాలీవుడ్ ప్రముఖులు రామ్ చరణ్ తేజ్ ను టార్గెట్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్ చేశారు.
వాళ్లందరికీ కూడా ట్రిపుల్ ఆర్ అనే సినిమాతో ఆన్సర్ చెప్పాడు చరణ్. త్రిబుల్ ఆర్ సినిమాలో చరణ్ నటించిన విధానం నెక్స్ట్ లెవెల్. చాలామంది అల్లూరి సీతారామరాజు గెటప్ చూసి శ్రీరాముడు అని ఫీలైన సందర్భాలు కూడా.
ఇకపోతే ప్రస్తుతం రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ లో అప్పుడు అనుకున్న సక్సెస్ సాధించకపోయినా కూడా దర్శకుడు రాజ్ కుమార్ ఎటువంటి సినిమాలు తీశారో అందరికీ ఒక అవగాహన ఉంది. ఈసారి మాత్రం చరణ్ తో సినిమా చేస్తే పక్కా సక్సెస్ కొడతారు అనే నమ్మకం కూడా ఉంది. అయితే ఏం జరుగుతుందో చూడాలి.
తుఫాన్ సినిమాతో చాలా విమర్శలు ఎదుర్కొన్న రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ సినిమాతో ప్రూవ్ చేసుకున్న కూడా ఆ కంప్లీట్ క్రెడిట్ అనేది చరణ్ కు దక్కదు. ఎందుకంటే ఆ సినిమా రాజమౌళి దర్శకత్వంలో వచ్చింది కాబట్టి తనకంటూ కొంత క్రెడిట్ వెళ్తుంది.
మరోవైపు ఆ సినిమాలో ఎన్టీఆర్ నటించాడు కాబట్టి తనకి కొంత క్రెడిట్ వెళ్తుంది. సోలో హీరోగా బాలీవుడ్ లో ప్రూవ్ చేసుకోవలసిన అవసరం ఖచ్చితంగా చరణ్ కు ఉంది. అది రాజ్ కుమార్ హిరానీ వలన సాధ్యం అవుతుందో ఏమో చూడాలి.
Also Read: Thiruveer: ఆ సినిమా టికెట్ కౌంటర్ లోనే చచ్చిపోతా అనుకున్నా