Divi Vadthya: దివి వాద్త్య గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ కెరీర్ ను ప్రారంభించింది దివి
మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో మహేష్ కు ఫ్రెండ్ గా నటించి మెప్పించింది. ఈ సినిమా ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టింది.
ఇక మహర్షి ఇచ్చిన గుర్తింపుతో అమ్మడు బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా హౌస్ లో అడుగుపెట్టింది.
తన అందంతో.. గేమ్స్ తో తనకంటూ అభిమానులలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది దివి.
ఇక బిగ్ బాస్ నుంచి వచ్చాకా అమ్మడికి బాగానే అవకాశాలు దక్కాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ లో దివి కీలక పాత్రలో నటించి మెప్పించింది.
ఇక పుష్ప 2 లో కూడా దివి కనిపించింది. ఇంకోపక్క చిన్న సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటిస్తూ విజయం కోసం ఎదురుచూస్తుంది.
సినిమాల విషయం పక్కన పెడితే .. దివికి సోషల్ మీడియాలో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. నిత్యం తన ఫొటోస్ ను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
తాజాగా దివి.. సాగరకన్యగా దర్శనమిచ్చింది. బీచ్ ఒడ్డుకు కొట్టుకొచ్చిన జలకన్యలా ఆమె కనిపించింది.
ఇక ఇందులో కూడా ఎద అందాలను ఆరబోస్తూ.. కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
దివి ఫోటోలను చూసిన అభిమానులు నిజంగా సాగరకన్య ఇంత అందంగా ఉంటుందా.. ? అని కొందరు.. చాలా అందంగా ఉన్నావని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.