World’s Fastest Train: ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించే రైళ్లు చైనాలోనే ఉన్నాయి. ప్రస్తుతం అక్కడున్న బుల్లెట్ రైళ్లు ఇంచుమించు గంటకు 350 నుంచి 400 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్తున్నాయి. వీటిని తలదన్నే మరో రైలును రూపొందిస్తున్నది డ్రాగన్ కంట్రీ. దాన్ని పేరు ‘మాగ్లెవ్ రైలు’. ఈ రైలు హైపర్ లూప్ లో ప్రయాణించనుంది. మాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీని ఉపయోగించి తయారు చేస్తున్న ఈ రైలు గాల్లోనే తేలుతూ ముందుకు దూసుకెళ్లనుంది. ప్రయాణీకులను అత్యంత వేగంగా గమ్యస్థానాలకు చేర్చాలనే లక్ష్యంతో చైనా ఈ రైలును రూపొందిస్తున్నది. ఇప్పటికే ఈ అత్యధునిక రైలు నడిచేందుకు కావాల్సిన మౌళిక వసతులను రూపొందిస్తున్నది చైనా రైల్వే సంస్థ. ఈ రైళ్లు అందుబాటులోకి వస్తే, నిమిషాల వ్యవధిలో వందల కిలో మీటర్ల దూరం చేరుకునే అవకాశం ఉంటుంది.
Read Also:వెయిటింగ్ టికెట్‌తో రిజర్వేషన్ కోచ్‌లో వెళ్తున్నారా? కేంద్ర మంత్రి సీరియస్ వార్నింగ్!
‘మాగ్లెవ్ రైలు’ ప్రత్యేకతలు ఇవే!
అత్యంత వేగవంతమైన, పర్యావరణ అనుకూలమైన రైళ్లను చైనా చాలా కాలంగా రూపొందిస్తున్నది. అందులో భాగంగానే ‘మాగ్లెవ్ రైలు’కు శ్రీకారం చుట్టింది. ప్రపంచ రైల్వే చరిత్రంలో తమ దరిదాపుల్లోకి ఎవరూ రాలేనంత వేగంతో కూడిన రైలును తయారు చేస్తున్నది.
⦿ ‘మాగ్లెవ్ రైలు’ మాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీతో రూపొందుతుంది. రైలులోని సూపర్ కండక్టింగ్ అయస్కాంతాలు రైలును లెవిటేట్, రైజ్ చేయడానికి పైవైపు ఉన్న మెటల్ తో ఇంటరాక్ట్ అవుతాయి.
⦿ ట్రాక్ తో సంబంధం లేకుండా మాగ్నటిక్ అనేది రైలును ముందుకు నడిపించడానికి గాలి కుషన్‌ను సృష్టిస్తుంది.
⦿ ఈ రైలు గరిష్టంగా గంటకు(621 mph) 1,000 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ప్రస్తుతం చైనా హై స్పీడ్ రైళ్లు గంటకు(217 mph) 400 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి.
⦿ ప్రస్తుతం చైనాలోని లాంగ్ రూట్ కమర్షియల్ విమానాలు గంటకు సగటున 547 నుంచి 575 మైళ్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. ఈ రైలు విమానాల వేగాన్ని మించి ఉంటుంది.
⦿ చైనా ప్రతిష్టాత్మక ‘మాగ్లేవ్ రైలు’ చాంగ్ షా నాన్ స్టేషన్ నుంచి ఇప్పటికే ఉన్న 11.5 మైళ్ల మాగ్లేవ్ ఎక్స్ ప్రెస్ లైన్ S2 నుంచి బ్రాంచ్ అవుతుంది.
⦿ ప్రయాణీకులకు ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడానికి పరిశోధకులు హైపర్ లూప్ ట్యూబ్ లోపలి గోడ వెంట రెండు సమాంతర కేబుళ్లను వేయాలని నిర్ణయించారు.
⦿ రైలు వేగంలో మార్పుతో సిగ్నల్ ఫ్రీక్వెన్సీ మార్పుల కారణంగా సంభవించే అంతరాయాలను తగ్గించడానికి ఈ కేబుళ్లు విద్యుదయస్కాంత సంకేతాలను విడుదల చేస్తాయి.
⦿ ‘మాగ్లేవ్ రైలు’ అందుబాటులోకి వస్తే చైనాలోని అతిపెద్ద నగరం అయిన షాంఘై సిటీ సెంటర్ నుంచి విమానాశ్రానికి కేవలం 7 నిమిషాల్లో చేరుకోనుంది. అంతేకాదు, ఈ రైలు బీజింగ్ నుంచి షాంఘై వరకు కేవలం 90 నిమిషాల్లో చేరుకోనుంది.
⦿ ప్రస్తుతం ప్రోటోటైప్ రైళ్లకు సంబంధించి హై స్పీడ్ ప్రొపల్షన్ పరీక్షలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ రైలు లాంఛింగ్ డేట్ తో పాటు ఏ నగరాల నడుమ నడిపిస్తారనే అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Read Also: ట్రయల్ రన్ కు రెడీ అవుతున్న వందే భారత్ స్లీపర్ ట్రైన్, ప్రత్యేకతలు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!