Aishwarya Rajesh (Source: Instragram)
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఐశ్వర్య రాజేష్ ఎవరో కాదు దివంగత నటులు రాజేష్ కూతురు. ప్రముఖ నటీమణి శ్రీలక్ష్మి మేనకోడలు కూడా.
Aishwarya Rajesh (Source: Instragram)
ఇక తండ్రి ప్రోత్సాహంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె ఇక్కడ హీరోయిన్గా అవకాశాల కోసం ప్రయత్నం చేసింది. కానీ తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.
Aishwarya Rajesh (Source: Instragram)
దీంతో కోలీవుడ్ కి వెళ్లిపోయిన ఈమె అక్కడే తన టాలెంట్ నిరూపించుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అడపా దడపా తెలుగులో కూడా పలు పాత్రలు చేసి మెప్పించింది.
Aishwarya Rajesh (Source: Instragram)
ఇక ఈ ఏడాది అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో వెంకటేష్ భార్యగా భాగ్యం పాత్రలో నటించి, తన పాత్రతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.
Aishwarya Rajesh (Source: Instragram)
అంతేకాదు ఈ సినిమాల్లో ఉత్తమ నటన కనబరిచినందుకు గానూ.. ఈమెకు అప్సర అవార్డు లభించింది. ప్రస్తుతం పలు జ్యువెలరీ షాప్స్ ఓపెనింగ్ కి వెళ్తున్న ఈమె అందులో భాగంగానే నిన్న మరో జువెలరీ షాప్ ఓపెనింగ్ లో కనిపించింది.
Aishwarya Rajesh (Source: Instragram)
ఇక ఇప్పుడు తాజాగా చీరకట్టులో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమెను చూసి భాగ్యం అందం రోజురోజుకీ పెరిగిపోతుందంటూ ఫాలోవర్స్ కామెంట్లు చేస్తున్నారు.