BigTV English
Advertisement

OTT Movie : పసికూనను తింటేగానీ తీరని ఆకలి… సూపర్ హీరోలను ఈకల్లా పీకి పారేసే మాన్స్టర్… ఫుల్ యాక్షన్ ధమాకా

OTT Movie : పసికూనను తింటేగానీ తీరని ఆకలి… సూపర్ హీరోలను ఈకల్లా పీకి పారేసే మాన్స్టర్… ఫుల్ యాక్షన్ ధమాకా

OTT Movie : థియేటర్స్‌లో ఈ ఏడాది జులై 25న రిలీజ్ అయిన ‘ఫాంటాస్టిక్ ఫోర్’ ఫ్రాంచైజ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ సూపర్ హీరో సినిమాని తొలిసారిగా మార్వెల్ స్టూడియోస్‌ పరిచయం చేసింది. 1200 కోట్ల తో తెరకెక్కిన ఈ సినిమా, ప్రపంచ వ్యాప్తంగా నాలుగు వేల కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ హిట్‌గా నిలిచింది. పిల్లలతో కలసి ఫ్యామిలీ మొత్తం ఈ సినిమాని థియేటర్లలో చూసి ఎంజాయ్ చేశారు. రీసెంట్ గా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌ లో కూడా ఈ సినిమా సత్తా చూపిస్తోంది. ఈ సినిమా కథ ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …


జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

‘The Fantastic Four: First Steps’ 2025లో వచ్చిన మార్వెల్ స్టూడియోస్ సూపర్‌హీరో మూవీ. మాట్ షాక్‌మన్ దర్శకత్వంలో పెడ్రో పాస్కల్, వనెస్సా కిర్బీ, జోసెఫ్ క్విన్, ఎబాన్ మాస్ మెయిన్ రోల్స్ లో నటించారు. 131 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా ఐఎండిబిలో 7.0/10 రేటింగ్ ని పొందింది. ఈ సినిమా 2025 జులై 25న థియేటర్లలో రిలీజ్ ఐంది. నవంబర్ 5 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఇప్పుడు ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

Read Also : భర్తకు బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిపోయే భార్య… ఐఎండీబీలో రేటింగ్ 8… క్రైమ్ మూవీ లవర్స్ కు పండగే


స్టోరీ ఏమిటంటే

రీడ్ రిచర్డ్స్, సూ స్టార్మ్, జానీ స్టార్మ్, బెన్ గ్రిమ్ అనే అనే సూపర్ హీరోలను ప్రజలు అభిమానాన్ని పొందుతారు. ఇంతలో రీడ్‌ స్యూ ల జంట పండంటి బిడ్డకి జన్మ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. దీనిపై అంతటా చర్చ మొదలవుతుంది. ఈ సమయంలో ప్రశాంతంగా ఉన్న భూమిపై ఒక విపత్తు దూసుకొస్తుంది. విశ్వాన్ని భక్షించే గ్రహాంతరవాసి అయిన గలాక్టస్, అతని దూత సిల్వర్ సర్ఫర్ నుండి భూమికి ప్రమాదం వస్తుంది. ఇప్పుడు భూమిన్ రక్షించడం వీరి లక్ష్యంగా మారుతుంది. స్యూ గర్భంలోని శిశువులో అపారమైన కాస్మిక్ శక్తి ఉందని గాలాక్టస్ తెలుసుకుంటాడు. ఆ శక్తి గలాక్టస్ కి ముప్పుగా మారుతుందని అతడు గ్రహిస్తాడు. ఆ బిడ్డను తనకు అప్పగిస్తే భూమిని విడిచిపెడతానని సందేశం పంపుతాడు. కానీ దీనికి ఏమాత్రం ఫాంటాస్టిక్ ఫోర్ ఒప్పుకోరు. దీంతో ఒక భీకర యుద్ధం మొదలవుతుంది. ఆ బిడ్డ కోసం గలాక్టస్ భూమిపైకి ఒక భయంకరమైన ఆకారంలో వస్తాడు. ఈ పోరాటంలో ఫాంటాస్టిక్ ఫోర్ భూమిని కాపాడతారా ? గలాక్టస్ ఆ బిడ్డని తెసుకెళ్తాడా ? ఈ క్లైమాక్స్ ఎలా ఉంటుంది ? అనే విషయాలను, ఈ సూపర్ హీరో సినిమాని చూసి తెలుసుకోండి.

Related News

OTT Movie : యాక్సిడెంట్ తరువాత కళ్ళు తెరిచి చూస్తే బంకర్‌లో… కన్నింగ్ గాడి ట్రాప్‌లో… స్పైన్ చిల్లింగ్ సర్వైవల్ థ్రిల్లర్

Baramulla OTT : పట్టపగలే పిల్లలు అదృశ్యం… కుమార్తె రూమ్ లో కుక్క వాసన… ఇంటెన్స్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్

The Bengal Files: ఓటీటీకి వివాదస్పద చిత్రం.. ‘ది బెంగాల్‌ ఫైల్స్‌’, ఎక్కడ చూడాలంటే!

OTT Movie : కళ్ళతో చూస్తే ఆత్మహత్య… ప్రపంచాన్ని తుడిచి పెట్టే మిస్టీరియస్ శక్తి… గ్రిప్పింగ్ థ్రిల్లర్… ఊహించని ట్విస్టులు

OTT Movie : దసరా ఉత్సవాలపై 40 నిమిషాల మూవీ…. ‘ప్రొద్దుటూరు దసరా’ ఏ ఓటీటీలో ఉందో తెలుసా?

OTT Movie : స్నేహితుడిని ఇంటికి ఆహ్వానిస్తే… ఒక్కొక్కరిని మట్టుబెడుతూ పని కానిచ్చే సైకో… గూస్ బంప్స్ తెప్పించే థ్రిల్లర్

Avihitham: పితృస్వామ్య రాజ్యంలో బాధితులుగా కూతుర్లు.. ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం..!

Big Stories

×