Gouri G Kishan : గత రెండు రోజులుగా గౌరీ జి కిషన్ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గౌరీ 96 సినిమాలో జాను అనే పాత్ర చేసింది. అదే సినిమా తెలుగులో జాను పేరుతో తీసినప్పుడు కూడా గౌరీ నటించింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది. రీసెంట్ గా Others అనే ఒక సినిమా చేసింది. ఆ సినిమా నిన్న తమిళ్ లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో ‘ఓరు పార్వై పర్వతానే’ అనే ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ లో హీరో హీరోయిన్ ని ఎత్తుకుంటాడు.
ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న తరుణంలో ప్రమోషన్స్ జరుగుతుంటే, ఒక యూట్యూబర్ హీరోని హీరోయిన్ ను ఎత్తుకున్నారు కదా అమ్మాయి వెయిట్ ఎంత అని అడిగాడు.?
ఆ ప్రశ్న అడగ్గానే ఆ యూట్యూబర్ కు గౌరీ ఇచ్చి పడేసింది.నా బరువుకు సినిమాకి కథకు ఏంటి సంబంధం? సినిమాలో నా పాత్ర గురించి ఏమైనా మాట్లాడారా? మీరు చేస్తున్నది బాడీ షేమింగ్, నా బరువుతో మీకు అవసరం ఏంటి? మీరు చేస్తున్నది అసలు జర్నలిజమే కాదు. అంటూ తనదైన శైలిలో మాట్లాడింది.
అయితే గౌరీ మాట్లాడిన విధానం పై ఏకంగా కోలీవుడ్ ఇండస్ట్రీ అంతా సపోర్ట్ గా నిలబడుతుంది. రీసెంట్ గా మారి సెల్వ రాజ్ కు కూడా గౌరీ కి ఫోన్ చేసి మాట్లాడారట. అంతమంది క్రౌడ్ మధ్యలో నువ్వు అలా మాట్లాడటం నాకు బాగా నచ్చింది నీ ధైర్యం సూపర్ అంటూ అప్రిషియేట్ చేశారట. అలానే ఈ విషయంలో నా కంప్లీట్ సపోర్ట్ నీకే ఉంటుంది అని మారి సెల్వరాజ్ చెప్పారట.
రీసెంట్ గా ధ్రువ్ విక్రమ్ వి హీరోగా మారి సెల్వరాజ్ బైసన్ అనే సినిమా చేశారు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. రియల్ లైఫ్ లో కూడా ఆల్రెడీ గెలిచిన కబడ్డీ ప్లేయర్ల ని కలిసి తమ అభినందనలు తెలిపారు మారి సెల్వరాజ్.
కేవలం సినిమా కోసము ఆ క్రీడను వాడుకోవడమే కాకుండా నిజ జీవితంలో కూడా వెళ్లి వాళ్ళని కలవడం అనేది ఇంకా కొంచెం కొద్దిపాటి గౌరవాన్ని పెంచింది అని చెప్పాలి.