Big tv Kissik Talks: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో జానీ మాస్టర్ (Jani Master)ఒకరు. ఈయన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ తనలో ఉన్న డాన్స్ టాలెంట్ ను బయట పెడుతూ నేడు ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్ గా స్టార్ హీరోల సినిమాలకు పని చేస్తూ మంచి పొజిషన్ లో ఉన్నారు. ఇలా కెరియర్ పరంగా అంచలంచలు ఎదుగుతున్న జానీ మాస్టర్ పట్ల వచ్చిన ఆరోపణలు తన కెరియర్ పై కోలుకోలేని దెబ్బ కొట్టాయి. జానీ మాస్టర్ లైంగిక ఆరోపణలను ఎదుర్కొంటూ జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే.
జానీ మాస్టర్ అసిస్టెంట్ శ్రేష్టి వర్మ జానీ మాస్టర్ పై ఆరోపణలు చేస్తూ కేసు నమోదు చేశారు పలు సందర్భాలలో తనని లైంగికంగా వేధించారని, తనపై దాడి చేశారు అంటూ శ్రేష్టి వర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యి కొద్దిరోజుల పాటు జైలు జీవితాన్ని గడిపారు. అనంతరం ఈయన బెయిల్ మీద బయటకు వచ్చి కెరీర్ పై ఫోకస్ పెట్టారు. ఇప్పుడిప్పుడే సినిమా అవకాశాలను అందుకుంటూ జానీ మాస్టర్ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. అయితే తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ (Big tv kissik Talks)కార్యక్రమానికి ఢీ 10 విన్నర్ రాజు(Raju) హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాజు జానీ మాస్టర్ అరెస్టు గురించి కూడా మాట్లాడారు.
రాజు పలువురు మాస్టర్ల గురించి మాట్లాడుతూ వారికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే యాంకర్ వర్ష జానీ మాస్టర్ గురించి కూడా అడగడంతో ఈయన స్పందిస్తూ జానీ మాస్టర్ అరెస్టు కావడం నిజంగా బాధాకరమైన విషయం అని తెలిపారు. అతేకాకుండా ఆయనకు వచ్చిన నేషనల్ అవార్డు (National Award)కూడా వెనక్కి వెళ్లిపోవడం చాలా బాధనిపించిందని, నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేయకుండా ఉండాల్సింది అంటూ జానీ మాస్టర్ అరెస్టుపై స్పందించారు. నేషనల్ అవార్డు వెనక్కి వెళ్ళింది అంటే అంతకంటే గొప్ప అవార్డు మాస్టర్ కి తప్పకుండా వస్తుంది అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇలా జానీ మాస్టర్ గురించి రాజు చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ఈయన అరెస్టుకు ముందు నేషనల్ అవార్డుకు ఎంపిక కావడంతో అభిమానులందరూ సంతోషం వ్యక్తం చేశారు .కానీ లైంగిక ఆరోపణల కేసులో జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యారనే విషయం తెలియడంతో నేషనల్ అవార్డు కూడా క్యాన్సిల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ అరెస్టుపై జానీ మాస్టర్ పలుమార్లు స్పందించారు. నిజా నిజాలు త్వరలోనే తెలుస్తాయని, ఇదంతా ఇండస్ట్రీలో నా ఎదుగుదలను చూసి ఓర్వలేక చేస్తున్న కుట్ర అంటూ ఈ ఘటనపై స్పందించారు. ఇక ప్రస్తుతం జానీ మాస్టర్ రామ్ చరణ్, రామ్ పోతినేని వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.
Also Read: Big tv Kissik Talks: సూసైడ్ ఆలోచన చేసిన ఢీ రాజు.. ఊపిరి ఆడలేదంటూ!