Qatar Airways News: ప్రయాణీకులకు ఇబ్బంది కలగకుండ గమ్యస్థానాలకు చేర్చాల్సిన కనీస బాధ్యత విమానయాన సంస్థలకు ఉంటుందని , హైదరాబాద్ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ అభిప్రాయపడింది. లేని పక్షంలో సదరు ప్రయాణీకులకు తగిన పరిహారం చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. ఓ సీనియన్ సిటిజన్ కుటుంబానికి సరైన సేవలు అందించకపోవడంతో ఖతార్ ఎయిర్ వేస్ విమానయాన సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సదరు వ్యక్తికి రూ. 45 వేలు చెల్లించాలని ఆదేశించింది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
సికింద్రాబాద్ నేరేడ్ మెట్ కు చెందిన రమకాంత్ పసుమర్తి (73) బుడా పెస్ట్ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణించడానికి ఖతార్ ఎయిర్ వేస్ విమానయాన సంస్థ నుంచి మూడు టికెట్లు బుక్ చేసుకున్నాడు. జూన్ 8, 2024న బుడాపెస్ట్ నుంచి ప్రయాణం ప్రారంభం కావాలి. దోహాలో షెడ్యూల్ చేయబడిన లే ఓవర్‌తో ఖతార్ ఎయిర్ వేస్ QR 200 (బుడాపెస్ట్ నుంచి దోహా), QR 4778 (దోహా నుంచి హైదరాబాద్) విమానాలలో ప్రయాణాన్ని కన్ఫార్మ్ చేసింది. కానీ, బుడాపెస్ట్ లో చెక్ ఇన్ చేసినప్పుడు రమకాంత్ కు అంతర్జాతీయ విమానయాన సంస్థకు బదులుగా తక్కువ ధరకు ప్రయాణించే ఇండిగో విమానం 6E 1318 బోర్డింగ్ పాస్‌లు ఇచ్చారు.
ప్రయాణ సమయంలో తీవ్ర ఇబ్బందులు
ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా బడ్జెట్ ఎయిర్ లైన్ కు మారడం వల్ల తనకు, తన భార్యకు, మనవడికి తీవ్ర ఇబ్బంది కలిగిందని రమాకాంత్ చెప్పారు. ముఖ్యంగా వారి వయస్సు, సుదీర్ఘ విమాన ప్రయాణ వ్యవధి కారణంగా అవస్థలు పడినిట్లు తన ఫిర్యాదులో వెల్లడించారు. యూరప్ లో అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ల నుంచి తిరిగి వస్తున్న తన మనవడు ఈ ప్రయాణాన్ని బాధాకరంగా భావించాడని ఆయన చెప్పుకొచ్చారు. ఈ విషయానికి సంబంధించి స్పష్టత, పరిష్కారం కోసం ఖతార్ ఎయిర్‌వేస్‌ను సంప్రదించడానికి అనేకసార్లు ప్రయత్నించినప్పటికీ అవకాశం ఇవ్వలేదని కంప్లైట్ లో వెల్లడింఆరు. ఈ నేపథ్యంలోనే వినియోగదారుల కోర్టును ఆశ్రయించవలసి వచ్చిందని వెల్లడించారు.
Read Also: దేశంలో అత్యంత పొడవైన వందే భారత్ స్లీపర్ జర్నీ.. అదీ తెలుగు రాష్ట్రాల మీదుగా!
ఖతార్ ఎయిర్ వేస్ ఏం చెప్పిందంటే?
ఈ విషయంపై జరిగిన వాదోపవాదాల్లో తమ భాగస్వామి ఎయిర్ లైన్స్‌తో కోడ్ షేర్ ఒప్పందం కారణంగా ఈ మార్పు జరిగిందని ఖతార్ ఎయిర్ వేస్ వెల్లడించింది. అయితే, బుకింగ్ నిర్ధారణలో కోడ్ షేర్ విమానం గురించి ప్రస్తావించలేదని కమిషన్ గుర్తించింది. కీలక వివరాలను వెల్లడించడంలో వైఫల్యం వినియోగదారుల రక్షణ చట్టం, 2019 లోని సెక్షన్ 2(47) ప్రకారం నేరం అవుతుందని కోర్టు అభిప్రయాపడింది. ఖతార్ ఎయిర్ వేస్ తన సర్వీసును సక్రమంగా అందివ్వలేదని గుర్తించింది. ఫిర్యాదుదారుడి వయస్సు, ఆరోగ్య పరిస్థితులను పరిగణలోకి తీసుకుని రమాకాంత్ కు రూ. 45,000ను పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. నిర్ణీత గడువులులోగా ఆయనకు డబ్బులు అందజేయాని తేల్చి చెప్పింది. ఇప్పటికైనా ప్రయాణీకులకు కచ్చితమైన సమాచారం ఇవ్వాలని సదరు విమానయాన సంస్థకు సూచించింది.
Read Also: దేశంలో అత్యంత పొడవైన 5 వందేభారత్ మార్గాలు ఇవే, ఒక్కోటి ఎన్ని కిలో మీటర్లు అంటే!