Ananya Panday: బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అనన్య.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని, అవార్డులను సొంతం చేసుకుంది.
ఇక తెలుగులో లైగర్ అనే సినిమాతో అడుగుపెట్టింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేసింది.
లైగర్ సినిమాతో అనన్య తెలుగులో పాగా వేస్తుంది అనుకుంటే.. అది ఇచ్చిన పరాజయంతో అమ్మడు బాలీవుడ్ పారిపోయింది.
వరుస పరాజయాలను అందుకుంటూ వస్తున్న అనన్య ఈ మధ్యనే వెబ్ సిరీస్ లతో మంచి హిట్లు అందుకుంటుంది. కాల్ మీ బే, కంట్రోల్ లాంటి సిరీస్ లు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చిపెట్టాయి.
ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియాలో అనన్య అందాల ఆరబోతకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి.
నిత్యం హాట్ హాట్ ఫొటోస్ తో కుర్రకారుకు కునుకు లేకుండా చేయడంలో ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు ముందే ఉంటుంది.
గత కొన్నిరోజులుగా అనన్య వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న విషయం తెల్సిందే. తాజాగా అనన్యా అట్లాంటిస్ ది రాయల్ రిసార్ట్ లో ఎంజాయ్ చేస్తూ కనిపించింది.
బీచ్ ఒడ్డున బికినీలో అందాలను ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. తాను తిరిగిన ప్రదేశాలన్నీ ఫోటోలు తీసి పెడుతూ.. ఈ రిసార్ట్ ను మిస్ అవుతున్నట్లు తెలిపింది.
ప్రస్తుతం అనన్య బికినీ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అమ్మడికి బికినీ ఫోటోలు కొత్తేమి కాదు. అందాలు ఆరబోయడం కొత్తేమి కాదు. ఇక ఈ చిన్నదాని అందం చూసి ఫ్యాన్స్.. ఏముందిరా బాబు అని కామెంట్స్ పెడుతున్నారు.
అనన్య కెరీర్ విషయానికొస్తే ఆమె చేతిలో ప్రస్తుతం కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అవి సెట్స్ మీదకు వెళ్లనున్నాయి. మరి ఈ చిన్నది తెలుగులో మళ్లీ ఎప్పుడు రీఎంట్రీ ఇస్తుందో చూడాలి.