Indian Railways: భారతీయ రైల్వే సంస్థ ప్రయాణీకులకు అదిరిపోయే న్యూస్ చెప్పింది. సెమీ హై స్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్ ప్రెస్ కోచ్‌లను పెంచబోతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ రైళ్లు పూర్తి ఆక్యుపెన్సీలతో నడుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఎక్కువ డిమాండ్ ఉన్న రూట్లలో నడుస్తున్న రైళ్లకు అదనపు కోచ్ లను యాడ్ చేయబోతున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఎక్కువ సీట్లు పెరిగి వెయిట్ లిస్టు తగ్గే అవకాశం ఉంది.
మూడు రకాల వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సేవలను అందిస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో మూడు రకాల కార్ కోచ్‌లు ఉన్నాయి . వాటిలో ఒకటి 16-కార్లు, రెండోది 8-కార్లు, మూడోది 20-కార్లు. వందే భారత్ రైళ్ల ప్రారంభంలో 16 కార్ల కోచ్‌లతో ట్రాక్ ఎక్కాయి. తర్వాత ఆ సంఖ్యను 8కి తగ్గించి కొన్ని రూట్లలో ప్రారంభించారు. ఇటీవల, రైల్వే సంస్థ రెండు 20 కోచ్‌ల వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టింది. ఇవి న్యూఢిల్లీ-వారణాసి, నాగ్ పూర్-సికింద్రాబాద్ రూట్లలో నడుస్తున్నాయి. వీటికి ప్రయాణీకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఇతర ప్రాంతాల్లో నడుస్తున్న రైళ్లకు సైతం కోచ్ లను పెంచాలని నిర్ణయించింది. “ప్రయాణికుల ఆక్యుపెన్సీ ఎక్కడ ఎక్కువగా ఉంటే, కొత్త కోచ్‌లను అక్కడ పెంచుతాం. 8 కోచ్‌ల వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ముందుకుగా 16 కోచ్ లకు పెంచుతాం. ఆ తర్వాత 16 కార్ల రైళ్లను 20 కోచ్ లకు తీసుకెళ్తాం” అని ఓ రైల్వే అధికారి వెల్లడించారు.
దేశంలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల సేవలు
ప్రస్తుతం దేశంలో సుమారు 130 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు సేవలు అందిస్తున్నాయి. ఈ రైళ్లు అన్నీ చెన్నైకి చెందిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో తయారు అయ్యాయి. ఈ రైళ్లు దేశంలో రైలు ప్రయాణాన్ని విప్లవాత్మకంగా మార్చాయి. అత్యంత వేగం, అత్యాధునిక సౌకర్యాలు కలిగిన ఈ రైళ్లకు ప్రయాణీకుల నుంచి మంచి డిమాండ్ ఏర్పడింది. వందే భారత్ రైళ్లు మూడు రకాల రంగులను కలిగి ఉంది. బ్లూ-వైట్, ఆరెంజ్- వైట్, ఆరెంజ్-గ్రే కలర్స్ రైళ్లు సేవలు అందిస్తున్నాయి.
Read Also: వందే భారత్ VS పాకిస్తాన్ గ్రీన్ లైన్, వీటిలో ఏ రైలు తోప్ అంటే?
వందే భారత్ ఎక్స్ ప్రెస్ వెర్షన్
ప్రస్తుతం వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో రెండు వెర్షన్లు అందుబాటులో ఉన్నాయి. వందే భారత్ చైర్ కార్, నమో భారత్ ర్యాపిడ్ రైల్ (వందే మెట్రో అని కూడా పిలుస్తారు). నేషనల్ ట్రాన్స్ పోర్టర్ కొత్త వెర్షన్, వందే భారత్ స్లీపర్ రైలు వచ్చే ఏడాది ప్రారంభం కానున్నాయి. BEML తయారు చేసిన వందే స్లీపర్ రైలు రాత్రి పూట ఎక్కువ దూరం ప్రయాణించే వారికి అనుకూలంగా రూపొందించారు.
Read Also: భారత్ లో చిట్ట చివరి రైల్వే స్టేషన్ ఇదే! కానీ, ఇక్కడ రైలు ఆగదు ఎందుకో తెలుసా?