BigTV English

Lokesh on DSC: గుడ్ న్యూస్ చెప్పిన నారా లోకేష్.. త్వరలోనే డీఎస్సీ అంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటన

Lokesh on DSC: గుడ్ న్యూస్ చెప్పిన నారా లోకేష్.. త్వరలోనే డీఎస్సీ అంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటన

డీఎస్సీ.. డోంట్ వర్రీ


⦿ లీగల్‌ సమస్యలు లేకుండా, పకడ్బందీగా మెగా డీఎస్సీ
⦿ వచ్చే ఏడాది పూర్తి చేస్తామని విద్యాశాఖ మంత్రి హామీ
⦿ విద్యను కూటమి ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంది
⦿ 1998 డీఎస్సీ బాధితుల్లో కొందరికి పోస్టులు ఇచ్చాం
⦿ ఇంకా 600 ఖాళీలు ఉన్నాయి, త్వరలోనే భర్తీ చేస్తాం
⦿ టీడీపీ ఆవిర్భావం తర్వాత 11 డీఎస్సీ నోటిఫికేషన్లు
⦿ లక్షా 50 వేల మంది ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేశాం
⦿ వైసీపీ హయాంలో ఒక్క టీచర్ పోస్టూ భర్తీ చేయలేదు
⦿ నిరుద్యోగుల పోరాటంతో టీడీపీ కూటమికి 93% సీట్లు
⦿ ఉద్యోగ కల్పన మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది
⦿ అసెంబ్లీ సమావేశాల్లో విద్యాశాఖ మంత్రి లోకేశ్ వ్యాఖ్యలు

అమరావతి, స్వేచ్ఛ:
Lokesh on DSC: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నిరుద్యోగులకు తీపి కబురు చెప్పారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కొన్ని అనివార్య కారణాలతో నిలిచిపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా డీఎస్సీ నిర్వహణపై క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో భాగంగా 1998 డీఎస్సీ బాధితులపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు అడిగిన ప్రశ్నకు లోకేశ్ సమాధానమిస్తూ, టీడీపీ హయాంలో ఎన్ని డీఎస్సీలు వచ్చాయి? ఎన్ని పోస్టులు భర్తీ చేశారు? చంద్రబాబు హయాంలో ఎన్ని డీఎస్సీలు నిర్వహించారు? అనే విషయాలపై మంత్రి సుదీర్ఘ ప్రసంగం చేశారు.


‘ మెగా డీఎస్సీపై గతంలో ఎన్ని కేసులు పడ్డాయో, వాటిని స్టడీ చేయాలని అధికారులను ఆదేశించాను. తగినంత సమయం కావాలని అధికారులు కోరారు. టీడీపీ కూటమి ప్రభుత్వం హయాంలో ఇచ్చే నోటిఫికేషన్ పకడ్బందీగా ఉండాలని ఆదేశాలిచ్చాం. యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ ఉపాధ్యాయ పోస్టులు అన్నింటినీ వచ్చే ఏడాది (2025) భర్తీ చేస్తాం’ అని లోకేశ్ కీలక ప్రకటన చేశారు.

అవును.. టీడీపీనే
‘ విద్యను టీడీపీ కూటమి ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 11 డీఎస్సీలు ఏర్పాటు చేశాం. తద్వారా లక్షా 50 వేల మంది ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడం జరిగింది. ఇందులో 9 డీఎస్సీ నోటిఫికేషన్లు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చాయి. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక తొలి సంతకం మెగా డీఎస్సీపై చేయడం జరిగింది. నా ఫోన్ నంబర్ రాష్ట్రంలోని చాలా మంది డీఎస్సీ అభ్యర్థులకు తెలిసిపోయింది. డీఎస్సీ గురించి నాకు నేరుగా ఫోన్లు, మెసేజులు చేశారు. ముఖ్యంగా టెట్ తర్వాత డీఎస్సీ నిర్వహిస్తే బాగుంటుందని కోరారు.

ఇందులో భాగంగానే టెట్ నిర్వహించాం. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం. ఈ డీఎస్సీ ద్వారా 16 వేల పైచిలుకు పోస్టులు భర్తీ చేయబోతున్నాం. గత వైసీపీ ప్రభుత్వం ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయలేదు. నిరుద్యోగులు, డీఎస్సీ అభ్యర్థులు టీడీపీ కూటమి వైపు మొగ్గుచూపారు. నిరుద్యోగ యువత పోరాటం మూలంగానే 93 శాతం సీట్లు టీడీపీ కూటమి కైవసం చేసుకుని విజయాన్ని అందుకున్నాం. మా ప్రభుత్వానికి ఉద్యోగాల పట్ల బాధ్యత ఉంది. ఉద్యోగ కల్పన అనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో తొలి హామీగా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పాం. ఇందులో భాగంగా మంత్రి వర్గ ఉపసంఘానికి ఛైర్మన్‌గా సీఎం చంద్రబాబు నన్ను నియమించారు.

1998 డీఎస్సీ బాధితులపై..
గత ప్రభుత్వం నోటిఫై చేసిన ప్రకారం 4,534 ఖాళీలు ఉన్నాయి. ఇందులో అపాయిట్మెంట్ ఆర్డర్స్ 3,939 మందికి ఇచ్చారు. సుమారు 600 ఖాళీలు ఉన్నాయి. ఇంకా ఎక్కువగానే ఉన్నాయని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చెబుతున్నారు. ఆ వివరాలు తీసుకుని తగు చర్యలు తీసుకుంటాం. 1998 డీఎస్సీ నోటిఫికేషన్‌లో 22,542 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే, 1998 డీఎస్సీలో ఉత్తీర్ణులైన వారిలో 18,008 మంది నియమితులయ్యారు.

ఆ తర్వాత పెండింగ్‌లో ఉన్న 4,534 పోస్టుల్లో ఎంటీఎస్ ద్వారా 3,939 పోస్టులు భర్తీచేశారు. ఇంకా 595 పోస్టులు భర్తీచేయాల్సి ఉంది. ఎంటీఎస్ కింద నియమితులైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వారికి ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండవు. వారికి రిటైర్మెంట్ వయసు 60 సంవత్సరాలు. శాసన సభ్యులు లేవనెత్తిన సమస్యపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’ అని అసెంబ్లీ వేదికగా లోకేశ్ ప్రకటించారు.

ఇదీ వికేంద్రీకరణ అంటే..
విభజన చట్టం ప్రకారం పెండింగ్‌లో ఉన్న విద్యాసంస్థలపై కూడా లోకేశ్ క్లారిటీ ఇచ్చారు . ‘2014-19 మధ్య చంద్రబాబు అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రాధాన్యత ఇచ్చారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన సెక్టార్​వైజ్ ఫోకస్ పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అనంతపురం జిల్లాకు కియా తెచ్చారు, చిత్తూరులో ఎలక్ట్రానిక్స్, నెల్లూరు విండ్ టర్బైన్, కర్నూలు రెన్యువబుల్ ఎనర్జీ, ఉభయగోదావరిలో ఆక్వా, ఉత్తరాంధ్ర ఐటీ, మెడికల్ డివైస్, ఫార్మా పరిశ్రమలను ప్రోత్సహించారు. విభజన చట్టంలో రాష్ట్రానికి కేటాయించిన విద్యాసంస్థలను కూడా వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఐఐటీ తిరుపతికి, ఐఐఎం విశాఖపట్నంకి, ఎన్ఐటీ తాడేపల్లిగూడెంకు, ట్రిపుల్ ఐటీ కర్నూలుకు, సెంట్రల్ వర్సిటీ అనంతపురానికి కేటాయించారు.

Also Read: Weather Updates : తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో వర్షాలు.. రైతులకు వాతావరణ శాఖ హెచ్చరిక..

అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఇదే. రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టుకోవడం కాదు. ఐఐటీ తిరుపతికి ఆగస్టు 9, 2016లోనే భూములు కేటాయించి పనులు ప్రారంభించారు. ఎన్ఐటీ తాడేపల్లిగూడెంకు ఏప్రిల్ 16, 2016లో 172 ఎకరాలు, విశాఖలో ఐఐఎంకు ఏప్రిల్ 16, 2016లో 240 ఎకరాలు, సెంట్రల్ వర్సిటీ అనంతపురానికి ఏప్రిల్ 16, 2016లో 491 ఎకరాలు, ఐషర్‌కు 255 ఎకరాలు, ట్రిపుల్ ఐటీలకు కూడా భూములు అప్పట్లోనే కేటాయించారు. ఈ విద్యాసంస్థల్లో పెండింగ్‌లో ఉన్న రోడ్లు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషిచేస్తాం’ అని నారా లోకేశ్ స్పష్టం చేశారు.

Related News

Ayyanna Patrudu: మాజీ సీఎం జగన్‌కు.. అయ్యన్నపాత్రుడు చురకలు..

Chicken Price Hike: భారీగా పెరిగిన చికెన్ ధరలు.. కిలో ఎంతో తెలుసా?

AP Politics: బీజేపీలోకి పోతుల సునీత.. చీరాల టికెట్‌పై కన్ను, తెర వెనుక జగన్?

Turakapalem: తురకపాలెం సాయిల్ పరీక్షల్లో సంచలన విషయాలు

Vahana Mitra scheme: ఏపీ వాహన మిత్ర స్కీమ్.. కొత్త గైడ్ లైన్స్ వచ్చేశాయ్, రూ. 15 వేలు మీ సొంతం

CM Chandrababu: సీఎం చంద్రబాబు సంకేతాలు.. సబ్జెక్టుతో రావాల్సిందే, ఏడు గ్రూపులు ఏర్పాటు

AP Bar License: బార్ల లైసెన్స్ పై.. సీఎం చంద్ర‌బాబు మ‌రో సంచ‌ల‌న‌ నిర్ణ‌యం

Post Office Collapse: పోస్ట్ ఆఫీసులో ఊడిపడ్డ పైకప్పు.. భయంతో పరుగులు పెట్టిన ఉద్యోగులు

Big Stories

×