Anasuya Bharadwaj (Source: Instragram)
జబర్దస్త్ యాంకర్ గా కెరియర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత నటిగా మారి ఇప్పుడు పాన్ ఇండియా స్టేటస్ సొంతం చేసుకుంది యాంకర్ అనసూయ.
Anasuya Bharadwaj (Source: Instragram)
రంగస్థలంలో రంగమ్మత్తగా నటించి, తన నటన విశ్వరూపాన్ని చూపించిన ఈమె ఇటీవల వచ్చిన రజాకార్ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
Anasuya Bharadwaj (Source: Instragram)
ఇప్పుడు పలు షోలకు జడ్జిగా వ్యవహరించే స్టేజికి ఎదిగింది అనసూయ. ఇక మరొకవైపు కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా వ్యక్తిగత కుటుంబానికి సమయం కేటాయిస్తూ ఉంటుంది.
Anasuya Bharadwaj (Source: Instragram)
అందులో భాగంగానే మొన్నటి వరకు కొత్త ఇంటి గృహప్రవేశం పూర్తి చేసిన ఈమె,ఆ తర్వాత తన పెద్ద కొడుకుకి ఉపనయనం చేయించి బాధ్యతలు నెరవేర్చుకుంది.
Anasuya Bharadwaj (Source: Instragram)
ఇక ఇప్పుడు తాజాగా ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్ళింది. అందులోనూ శ్రీలంకకి వెళ్లి అక్కడ సందడి చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.
Anasuya Bharadwaj (Source: Instragram)
శ్రీలంకలోని శంకరీ దేవి శక్తిపీఠం దర్శించుకున్న ఈమె.. ఆ తర్వాత.. సిగిరియ కొండ ఎక్కడం జీవితంలో అత్యంత సాహసంతో కూడుకున్న పని.. ఎటువంటి సాధనాలు లేకుండా షూస్ లేకుండా కొండెక్కాము. ఇది జీవితాంతం గుర్తుండిపోయే అనుభవం అంటూ తెలిపింది. ప్రస్తుతం వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను అనసూయ షేర్ చేసింది