lasyamanjunath (Source: Instagram)
Anchor Lasya House Warming Photos: యాంకర్ లాస్య సొంతింటి కలను నిజం చేసుకుంది. ఇటీవల కొత్తింట్లోకి అడుగుపెట్టింది. తాజాగా ఈ విషయం చెబుతూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసింది.
lasyamanjunath (Source: Instagram)
కాగా లాస్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా రాణించింది. అంతేకాదు టీవీ షో, ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌ని కూడా హోస్ట్ చేసింది.
lasyamanjunath (Source: Instagram)
ఢీతో పాటు పలు షోలకు యాంకర్‌గా చేసిన లాస్య పెళ్లి అనంతరం బుల్లితెరకు బై బై చెప్పింది. మంజునాథ్‌ను ప్రేమ పెళ్లి చేసుకున్న లాస్య యాంకరింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి గృహిణిగా ఇల్లు, పిల్లల బాధ్యత చూసుకుంటుంది.
lasyamanjunath (Source: Instagram)
యాంకరింగ్ మానేసిన.. బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా వచ్చి సందడి చేసింది. ఈ షో మరింత పాపులారిటీ సంపాదించుకున్న లాస్య హౌజ్ నుంచి బయటకు రాగానే యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టింది.
lasyamanjunath (Source: Instagram)
యూట్యూబ్ వేదికగా తన ఫ్యామిలీ విషయాలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి టచ్‌లో ఉంటుంది. అంతేకాదు యూట్యూబ్ ద్వారా కూడా బాగానే సంపాదిస్తున్న లాస్య ఇటీవల సొంతింటి కలను నిజం చేసుకుంది.
lasyamanjunath (Source: Instagram)
తాజాగా మరో ఇంటిని నిర్మించి కొత్తింట్లోకి అడుగుపెట్టింది. గృహ ప్రవేశానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. "మా కలల ఇల్లు. . గృహప్రవేశంతో శుభారంభం.. ప్రతి గోడలో ఒక కల, ప్రతి మూలలో ఒక జ్ఞాపకం… మా కొత్త గూడు, కొత్త ఆరంభం… కొత్త జ్ఞాపకాలు" అంటూ గృహ ప్రవేశం ఫోటోలు షేర్ చేసింది.
lasyamanjunath (Source: Instagram)
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా బుధవారం లాస్య తన భర్త, పిల్లలతో కలిసి నూతన ఇంటిక గృహ ప్రవేశ వేడుకును జరుపుకుంది.
lasyamanjunath (Source: Instagram)
ఈ కార్యక్రమానికి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ దేత్తడి హారిక, నోయెల్, నయని పావనితో పాటు బంచిక్ బబ్లూ, పలువురు సోషల్ మీడియా ఇన్ప్లూయేన్సర్లు హాజరయ్యారు.
lasyamanjunath (Source: Instagram)
ఈ సందర్భంగా నోయెల్ లాస్యతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. 'లాస్య అన్నట్టు ఆమె కొత్త ఇల్లు అసూయ పుట్టించేలా ఉంది' అని కామెంట్ చేశాడు.