Mahesh Babu: మహేష్ బాబు (Mahesh Babu)టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న నిజజీవితంలో కూడా హీరోగా పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఇప్పటికే ఎంతోమంది టాలీవుడ్ సినీ హీరోలు పెద్ద ఎత్తున ఆస్తులను సంపాదించడమే కాకుండా ఆ డబ్బుతో పేదవారికి ఎన్నో విధాలుగా సహాయపడుతున్న సంగతి తెలిసిందే. ఇక మహేష్ బాబు కూడా మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎంతో మంది విద్యార్థులకు చదువుతోపాటు వారి సౌకర్యాలను కూడా చూసుకుంటున్నారు. ఇక మహేష్ బాబు ఫౌండేషన్(Mahesh Babu Foundation) ద్వారా చిన్న పిల్లలకు గుండె శస్త్ర చికిత్సలు చేయిస్తున్న విషయం తెలిసిందే.
మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే ఎంతోమంది చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లను(Heart Operations) ఉచితంగా నిర్వహిస్తూ వారికి పునర్జన్మను కల్పించారు. ఇలా మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు 5000 మంది చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లను నిర్వహించడమే కాకుండా ఈ ఆపరేషన్లు విజయవంతం అయ్యాయని తెలుస్తోంది. ఇలా 5000 మంది చిన్నారులకు మహేష్ బాబు పునర్జన్మ కల్పించారనే విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా పేదల పాలిట మీరు దేవుడని, మనిషి రూపంలో ఉన్న దేవుడు అంటూ మహేష్ బాబు పై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు.
మహేష్ బాబు ఇలాంటి ఒక గొప్ప సేవా కార్యక్రమాన్ని ప్రారంభించడానికి కారణం లేకపోలేదని చెప్పాలి. తన కుమారుడు గౌతమ్ నెలలు నిండకముందే పుట్టడం వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నామని ఆ సమయంలో మాకు డబ్బు ఉంది కాబట్టి సరిపోయింది డబ్బు లేని వారి పరిస్థితి ఏంటి? అనే ఆలోచనలు మొదలైందని ఆ ఆలోచన మహేష్ బాబు ఫౌండేషన్ కు కారణమైందని పలు సందర్భాలలో తెలియచేశారు. ఇలా ఇప్పటివరకు 5000 మంది చిన్నారులకు ఆపరేషన్లు నిర్వహించడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.
అడ్వెంచరస్ మూవీగా SSMB 29..
ఇక మహేష్ బాబు కెరియర్ విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం వరుస సినిమాల ద్వారా తెలియపరంగా బిజీగా ఉన్నారు. ఇటీవల గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు ఈ సినిమా తర్వాత రాజమౌళి (Rajamouli) డైరెక్షన్లో బిజీగా ఉన్నారు. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో సినిమా అంటేనే ఈ సినిమాపై అంతర్జాతీయ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాకు వారణాసి(Varanasi) అనే టైటిల్ పెట్టాలని ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా అడ్వెంచరస్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించగా, ఈ సినిమాలో సీనియర్ నటుడు మాధవన్, పృధ్విరాజ్ సుకుమారన్ వంటి వారు కీలక పాత్రలలో నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి విషయాలను కూడా అధికారికంగా వెల్లడించలేదు.
Also Read: Dulquer Salman: కేరళ హైకోర్టులో దుల్కర్ సల్మాన్ కు ఊరట.. వెంటనే వెనక్కి ఇచ్చేయాలంటూ!