hegdepooja (Source: Instagram)
Pooja Hegde Latest Photoshoot: 'బుట్టబొమ్మ' పూజ హెగ్డే లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. దీపావళి సందర్భంగా రెడ్ డ్రెస్‌లో మెరిసింది. దీపావళి వచ్చేసింది అంటూ పండగ సందడి తీసుకువచ్చింది.
hegdepooja (Source: Instagram)
పూజని ఇలా చూసి నెటిజన్స్ అంత ఫిదా అవుతున్నారు. మేడం సర్ మేడం అంతే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం పూజ ఫోటోలు నెట్టింట సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచాయి.
hegdepooja (Source: Instagram)
కాగా ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది ఈ భామ. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు, సూపర్, బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో తెలుగులో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.
hegdepooja (Source: Instagram)
ఎంట్రీతో హిట్ కొట్టి ఆ తర్వాత వరుసగా బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకుంది. దీంతో టాలీవుడ్ లక్కీ లెగ్ అనే ముద్ర వేసింది ఇండస్ట్రీ. దీంతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. పెద్ద సినిమా, స్టార్ హీరోలకు పూజనే తొలి ప్రాధాన్యత అయిపోయింది.
hegdepooja (Source: Instagram)
అంతగా గుర్తింపు పొందింది. ఇక వరుస ప్రాజెక్ట్స్ ఫుల్ స్వింగ్‌లో ఉన్న ఆమె కెరీర్‌కి ఆచార్య, రాధేశ్యామ్ చిత్రాలు బ్రేక్ వేశాయి. ఈ రెండు సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ ప్లాప్స్ చూసింది. అదే టైంలో తమిళంలో దళపతి విజయ్ సరసన చేసిన బీస్ట్ మూవీ డిజాస్టర్ అయ్యింది.
hegdepooja (Source: Instagram)
ఇది ఈ బుట్టబొమ్మకు మైనస్ అయ్యింది. ఈ చిత్రంతోనే ఆమె కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. బీస్ట్ ప్లాప్ అవ్వడంతో ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. దాంతో ఆఫర్స్ కూడా తగ్గిపోయాయి.
hegdepooja (Source: Instagram)
వచ్చిన అవకాశాలు కూడా ఆమె చేజారిపోవడంతో దక్షిణాది పూజ కెరీర్‌కి ఫుల్స్టాప్ పడింది. దీంతో ముంబైకి మాకాం మార్చిన ఈ బుట్టబొమ్మ ప్రస్తుతం బాలీవుడ్ ఆఫర్స్ కోసం తెగ కష్టపడుతుంది.