Telugu film industry: ఒకప్పుడు తెలుగు సినిమాకి కథ రాయటం చాలా ఈజీగా ఉండేది. పది ఇంగ్లీష్ సినిమాలు చూసి ఒక తెలుగు కథ రాసేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో అలా పది ఇంగ్లీష్ సినిమాలు చూసి ఒక కథ రాస్తే ఆడియన్స్ ఈజీగా పసిగట్టేస్తారు. ఎందుకంటే ఒకప్పుడు ప్రపంచ సినిమాను చూసే అవకాశం ఆడియన్స్ కి ఉండేది కాదు. కానీ ఈ రోజుల్లో ఓటీటీ చానల్స్ ఓపెన్ చేస్తే చాలు ఒక్కసారిగా అన్ని సినిమాలు చూడగలిగే అవకాశం దొరుకుతుంది. అందుకే చాలామంది తెలుగు ప్రేక్షకులు మలయాళం సినిమాలను కూడా విపరీతంగా చూసి ఇష్టపడటం మొదలుపెట్టారు.
ఇప్పటికీ కూడా కొంతమంది తెలుగు సినిమా దర్శక నిర్మాతలు మలయాళం సినిమాలను ఎంకరేజ్ చేస్తారు కానీ తెలుగు సినిమాలను చూడరు అని స్టేజ్ పైన వాపోతుంటారు. ఇకపోతే రీసెంట్ గా తెలుగు సినిమా దర్శకులు కూడా బయట నుంచి కాపీ కొడితే దొరికేస్తాము అని చెప్పి తెలుగు సినిమా పాత కథలనే కొత్తగా డిజైన్ చేసి నిర్మాతలకు వినిపించి ప్రాజెక్టులు ఓకే చేసుకుంటున్నారు.
దీపావళి కానుకగా డ్యూడ్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. నేడే విడుదలైన ఈ సినిమా కథ కొత్తదేమీ కాదు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య 2 సినిమా ఛాయలు ఈ సినిమాలో బోలెడు కనిపిస్తాయి. కానీ మైత్రి మూవీ మేకర్స్ ఫస్ట్ సిట్టింగ్ లోనే ఈ కథను ఓకే చేశారు.
అంటే మైత్రి మూవీ మేకర్ సంస్థ ఆర్య 2 సినిమా కూడా చూసి ఉండలేదా.? లేకపోతే దర్శకుడు కీర్తి ఏమైనా తన నేరేషన్ లో కొత్త మెలకువలు నేర్చుకొని కథను కొత్తగా చెప్పాడా.?
ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజకోన దర్శకురాలుగా పరిచయమైన సినిమా తెలుసు కదా. ఈ సినిమా కాన్సెప్ట్ కూడా కొత్తదేమీ కాదు. వరుణ్ అనే ఒక క్యారెక్టర్ అంజలిని పెళ్లి చేసుకుంటాడు. అంజలికి పిల్లల పుట్టారు అని తెలిసిన తర్వాత సరోగసి ద్వారా పిల్లలకు అంటారు ఆ దంపతులు. సరోగసి ద్వారా కనడానికి ఎంచుకునే పర్సన్ వరుణ్ యొక్క ఎక్స్ లవర్. ఈ సినిమా విషయంలో కూడా అక్కడక్కడ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా ఛాయలు కనిపిస్తాయి.
ఇవి కొత్త కథలేమీ కాదు పాత కథలకే కొద్దిగా రంగులు మార్చి వెండి తెర మీద ఆవిష్కరించారు. అయితే ఈ కథలు చాలామంది ప్రేక్షకులకు తెలిసినవే. సినిమాల మీద కోట్లు పెట్టే నిర్మాతలు ఇటువంటి విషయాలను గమనించరా అనేది అందరికీ వచ్చే డౌట్.
ఏదేమైనా దీపావళి కానుకగా విడుదలైన ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ అయితే అందుకోలేకపోయాయి. ఇక రాబోయే కిరణ్ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.
Also Read: People Media Factory: ఇంత చేసినా.. వీళ్లకు సొంత హిట్టు లేదు తెలుసా… హోప్స్ అన్నీ దానిపైనే