Dulquer salman: ప్రముఖ సినీ నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salman)కు కేరళ హైకోర్టులో (Kerala Heigh Court)భారీ ఊరట లభించింది. ఇటీవల ఆపరేషన్ నమ్ కోర్ పేరుతో కస్టమ్స్ అధికారులు కేరళలో పలువురు సెలబ్రిటీల ఇళ్లపై దాడి చేసిన సంగతి తెలిసిందే ఈ దాడిలో భాగంగా ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ లగ్జరీ కారును సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్లను భూటాన్ నుంచి అక్రమంగా రవాణా చేసే తరలించారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే కస్టమ్స్ అధికారులు ఈయన కారును సీజ్ చేశారు. ఇలాంటి ఖరీదైన కార్లకు ట్యాక్స్ చెల్లించకుండా అక్రమంగా రవాణా చేయడంతోనే అధికారులు సీజ్ చేశారు.
ఇక ఈ విషయంపై దుల్కర్ సల్మాన్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కస్టమ్స్ అధికారులు సీజ్ చేసిన కారును విడుదల చేయాలంటూ ఈయన కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే నేడు ఈ పిటిషన్ విచారణ అనంతరం కేరళ హైకోర్టు దుల్కర్ సల్మాన్ కు అనుకూలంగా తీర్పును ఇచ్చింది. ఈ విచారణ అనంతరం కస్టమ్స్ అధికారులు సీజ్ చేసిన దుల్కర్ సల్మాన్ లగ్జరీ ల్యాండ్ రోవర్ కారును వెంటనే తిరిగి వెనక్కి ఇచ్చేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో ఈయనకు ఊరట లభించింది. కస్టమ్స్ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలను ఎదుర్కొంటు దిగుమతి చేసిన వాహనాలను అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే.
ఆపరేషన్ నమ్‌ఖోర్ కింద, కస్టమ్స్ కేరళ అంతటా 30 కి పైగా ప్రదేశాలపై దాడులు చేసి సుమారు 36 వాహనాలను సీజ్ చేసిన సంగతి తెలిసిందే. భూటాన్ నుంచి లగ్జరీ కార్లను చాలా తక్కువ ధరలకు దిగుమతి చేసుకొని నకిలీ డాక్యుమెంట్స్ ద్వారా ఇండియాలో వాటిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే సీజ్ చేసిన కార్లలో నటుడు దుల్కర్ సల్మాన్ కారు కూడా ఉన్న నేపథ్యంలో ఈయన తన కారును విడుదల చేయాలి అంటూ అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించడంతో కోర్టు ఈయనకు అనుకూలంగా తీర్పును వెల్లడించింది.
నిర్మాతగా కూడా సక్సెస్…
దుల్కర్ సల్మాన్ కెరియర్ విషయానికి వస్తే.. మలయాళ చిత్ర పరిశ్రమలో నటుడిగా మంచి సక్సెస్ అందుకున్న దుల్కర్ ఇటీవల నిర్మాతగా కూడా సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈయన నటించిన సినిమాలకు తెలుగులో కూడా మంచి ఆదరణ లభిస్తుంది. ఇకపోతే దుల్కర్ సల్మాన్ పూర్తిస్థాయి తెలుగు సినిమాలలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల లక్కీ భాస్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టిన ఈయన తాజాగా మరో సినిమాని కూడా ప్రకటించారు. ఈ సినిమా ప్రస్తుతం DQ41 అనే పేరిట షూటింగ్ పనులను జరుపుకుంటుంది .ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకు రవి నేల కుదిటి దర్శకత్వం వహిస్తున్నారు.
Also Read: Keerthy suresh: ఆమె ప్రేమ ఓ కావ్యం.. ఆత్మ ఓ పాట.. ఆసక్తి పెంచుతున్న కీర్తి సురేష్ పోస్టర్!