OTT Movie : కొరియన్ సినిమాలు సరికొత్త కథలతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నాయి. ఈ రోజు నుంచి ఓటీటీలో కి వచ్చిన ఒక కొరియన్ సినిమా, ఆడియన్స్ చేత కేరింతలు పెట్టిస్తోంది. ఇది తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఈ కథ రియల్ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఒక జపాన్ విమానాన్ని ఒక కమ్యూనిస్ట్ గ్రూప్ హైజాక్ చేసి, ఉత్తర కొరియాకు తీసుకెళ్లాలనుకుంటుంది. కానీ దక్షిణ కొరియా ప్రభుత్వం వాళ్ళని మోసం చేసి సియోల్ ల్యాండ్ చేయిస్తుంది. ఈ ఆసక్తికరమైన సినిమా, ఆడియన్స్ కి ఒక పక్కా ఎంటర్టైనర్. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘గుడ్ న్యూస్’ (Good news) 2025లో వచ్చిన కొరియన్ కామెడీ సినిమా. బ్యూన్ సుంగ్ హ్యున్ దీనికి దర్శకత్వం వహించారు. ముఖ్య పాత్రల్లో పార్క్ సుల్ క్యుంగ్, హాంగ్ క్యుంగ్, ర్యూ సెంగ్-బుమ్ నటించారు. ఈ సినిమా 2025 అక్టోబర్ 17న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అయింది. IMDbలో 7.7/10 రేటింగ్ పొందిన ఈ కొరియన్ సినిమా, తెలుగు, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ లో అందుబాటులో ఉంది.
1970లో జపాన్‌లో ఒక ఎయిర్‌లైన్స్ విమానంను 9 మంది రెడ్ ఆర్మీ కమ్యూనిస్ట్ గ్రూప్ సభ్యులు హైజాక్ చేస్తారు. వాళ్లు విమానాన్ని ఉత్తర కొరియాకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తారు. విమానంలో 130 మంది ప్యాసింజర్స్ తో పాటు పైలట్లు కూడా ఉంటారు. హైజాకర్స్ పైలట్లను బెదిరించి, ఉత్తర కొరియాకు వెళ్లమని చెబుతారు. దక్షిణ కొరియా ప్రభుత్వం ఈ విషయం తెలిసి టెన్షన్‌లో పడుతుంది. పార్క్ అనే ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్, ఈ సమస్యను సాల్వ్ చేయడానికి “నోబడీ” అనే ఒక సీక్రెట్ ఏజెంట్‌ను కలుస్తాడు. ఇప్పుడు నోబడీ, సాంగ్-హ్యోన్ కలిసి విమానాన్ని సియోల్ లో ల్యాండ్ చేయడానికి ఒక ఫన్నీ ప్లాన్ వేస్తారు.
Read Also : పనిలేని వాడికి పవర్ వస్తే ఇట్టా ఉంటది… బ్యాంకుకు కన్నం వేసే మాస్టర్ ప్లాన్… వీళ్ళెక్కడి సూపర్ హీరోలు సామీ
విమానాన్ని సియోల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేయాలి, కానీ హైజాకర్స్‌కు అది ఉత్తర కొరియాలో ఉండే ప్యాంగ్ యాంగ్ సిటీ అని నమ్మించాలి. దీంతో వాళ్లు సియోల్ ఎయిర్‌పోర్ట్‌ను ఉత్తర కొరియా లాగా మారుస్తారు. ఉత్తర కొరియా ఫ్లాగులు, బోర్డులు, స్థానికులను ఉత్తర కొరియా యూనిఫామ్‌లో డ్రెస్ ని కూడా మార్పిస్తారు. హైజాకర్స్ లీడర్ మాడాకి మొదట అనుమానం వస్తుంది. కానీ నోబడీ రేడియో సిగ్నల్స్ మార్చి, వాళ్లను మోసం చేస్తాడు. హైజాకర్స్ ఎయిర్‌పోర్ట్‌ను ప్యాంగ్‌యాంగ్ అని నమ్ముతారు. చివరికి విమానం సియోల్ లో ల్యాండ్ అవుతుందా ? ప్రయాణికులు సేఫ్ అవుతారా ? ఈ క్లైమాక్స్ ఎలా ఉంటుంది ? అనే విషయాలను ఈ సినిమాని చూసి తెలుసుకోండి.