BigTV English

OTT Movie : కుళ్లిపోయిన స్థితిలో శవాలు… మాస్క్ వేసుకున్న సైకో అరాచకం… మంచు లక్ష్మి కిర్రాక్ ‘డెడ్లీ కాన్స్పిరసీ’

OTT Movie : కుళ్లిపోయిన స్థితిలో శవాలు… మాస్క్ వేసుకున్న సైకో అరాచకం… మంచు లక్ష్మి కిర్రాక్ ‘డెడ్లీ కాన్స్పిరసీ’
Advertisement

OTT Movie : మంచు లక్ష్మి, మోహన్ బాబు లీడ్ రోల్స్ లో నటించిన సినిమా ‘దక్ష: ది డెడ్లీ కాన్స్పిరసీ’. థియేటర్లలో రిలీజ్ అయిన నెల రోజుల తరువాత ఓటీటీలో కి వచ్చేసింది. ఈ సినిమా ఈ రోజు నుంచి ఆడియన్స్ కి అందుబాటులో ఉంది. తండ్రి, కూతుళ్ళు మొదటి సారిగా నటిస్తున్న మూవీ ఎలా వుంటుందో అని ఓటీటీ ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఒక పెద్ద మెడికల్ కుంభకోణం చుట్టూ తిరుగుతుంది. దీని వల్ల సిటీలో హత్యలు కూడా జరుగుతుంటాయి. ఈ కేసును దక్ష (మంచు లక్ష్మి) అనే పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. దీని వెనుక ఉన్న కుట్రను ఆమె బయట పెట్టిందా లేదా? అనేదే ఈ కథ. దీపావళి కానుకగా విడుదలవుతున్న ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


ఏ ఓటీటీలో కి వచ్చిందంటే

‘దక్ష: ది డెడ్లీ కాన్స్పిరసీ’ (Daksha: The Deadly Conspiracy) 2025లో వచ్చిన తెలుగు సైకలజికల్ థ్రిల్లర్ సినిమా. వామసీ కృష్ణ మల్ల దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో దక్ష (లక్ష్మి మంచు), డాక్టర్ విశ్వమిత్ర (మోహన్ బాబు), విస్వాంత్ (విస్వాంత్ దుడ్డుంపూడి), చిత్రా (చిత్రా శుక్ల) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా టీజర్‌ను ఆగష్టు 27న, ట్రైలర్‌ను సెప్టెంబర్ 6న రిలీజ్ చేయగా, మంచి అంచలనాలతో 2025 సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదల చేశారు. IMDbలో 7.0/10 రేటింగ్ తెచ్చుకున్న ఈ మూవీ అక్టోబర్ 17 నుంచి ఈ సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది.

కథలోకి వెళ్తే

ఒక పెద్ద హాస్పిటల్‌లో మనుషులపై ప్రయోగాలు చేస్తుంటారు. ఇక్కడ కొన్ని మిస్టీరియస్ హత్యలు కూడా జరుగుతాయి. దీంతో దక్ష అనే పోలీస్ ఆఫీసర్ ఈ కేసు విచారణ చేస్తుంది. సైకాలజిస్ట్ అయిన డాక్టర్ విశ్వమిత్ర దక్షకు సహాయం చేస్తాడు. ఈ ఇన్వెస్టిగేషన్ లో పెద్ద తలకాయలు ఉన్నాయని వాళ్ళు తెలుసుకుంటారు. దక్ష ఈ కుట్రను బయటపెట్టడానికి ట్రై చేస్తున్న సమయంలో, ఆమె లైఫ్ కూడా డేంజర్‌లో పడుతుంది. ఇక కథలో సస్పెన్స్ తో కూడిన అనేక ట్విస్టులు వస్తాయి. వాళ్లు మెడికల్ ట్రయల్స్‌లో పేషెంట్స్‌ను మోసం చేయడం, డబ్బుల కోసం కుట్రలు చేస్తున్నట్టు తెలుస్తుంది.


Read Also : బిజినెస్ మ్యాన్ కూతురితో బాడీగార్డు రాసలీలలు… నిద్రలోనూ అవే కలలు… బెస్ట్ రొమాంటిక్ – కామెడీ సిరీస్

దక్ష విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. ఇక్కడ సూపర్‌ నాచురల్ శక్తుల ఎంట్రీ కూడా వస్తుంది. ఏదో భయంకర శక్తి ఆమెను ఇబ్బంది పెడుతుంది. ఆమె చుట్టూ డేంజర్ కూడా పెరుగుతుంది. అయితే ప్రాణాలకు తెగించి, హత్యల వెనుక అసలు నిజాన్ని తెలుసుకుంటుంది. అలాగే సూపర్‌నాచురల్ శక్తులు కూడా ఈ కుట్రలో భాగమని బయట పడుతుంది. చివరికి దక్ష ఈ కేసును సాల్వ్ చేస్తుందా ? హత్యలు ఎవరు చేస్తుంటారు ? ఈ కథ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

 

 

Related News

OTT Movie : క్యాబ్ డ్రైవర్ తో రిచ్ పాప యవ్వారం… అర్దరాత్రి అడ్డంగా బుక్కయ్యే జంట… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ భయ్యా

OTT Movie : ఆంటీతో చెలగాటం పిల్లలకు ప్రాణ సంకటం.. అవార్డు విన్నింగ్ ఈ ఆంటీ అరాచకం… పోలీసులే తీసిన మూవీ ఇది

OTT Movie : ఆకాశంలో విహారయాత్ర… పైప్రాణాలు పైకే పోయే ఆపద… తెలుగులో ఓటీటీలోకి వచ్చేసిన కొరియన్ క్రైమ్ థ్రిల్లర్

Baaghi 4: ఓటీటీలోకి బాఘీ 4.. స్ట్రీమింగ్ అప్పుడే!

OTT Movie : ఇదొక మాస్టర్ పీస్ మావా… తలలు నరికి వేలాడ దీసే సైకో… మనుషుల్ని చంపితినే మానవ మృగాలు

OTT Movie : భార్య పోగానే గర్ల్ ఫ్రెండ్ తో హనీమూన్‌కు… మెంటల్ మాస్ ట్విస్టు మావా… క్రేజీ కొరియన్ హర్రర్ మూవీ

Friday OTT Movies: ఇవాళ ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

Big Stories

×