Rekha Boj: రేఖా భోజ్(Rekha Boj) ఇటీవల కాలంలో ఈమె సినిమాలు చేసి పాపులర్ అవ్వడం కంటే కూడా వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తున్నారు. నిత్యం సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద పోస్టులు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న రేఖా భోజ్ తాజాగా సినిమాల పట్ల ఆమెకి ఉన్న ఆసక్తిని తెలియజేస్తూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనకు సినిమాలు అంటే చాలా ఇష్టమని తెలిపారు అయితే సినిమాలలో అవకాశాలు కావాలి అంటే కమిట్మెంట్స్ అడుగుతున్నారని తెలిపారు.
గత మూడు సంవత్సరాలుగా తనకు కమిట్మెంట్స్ వస్తున్నాయని, తనకు పెద్ద ఎత్తున కార్లు, బంగ్లాలు ఇస్తామంటూ ఆఫర్లు ఇస్తున్నారు. ఒకవేళ వారు అడిగిన విధంగానే తాను కమిట్మెంట్స్ కనుక ఇచ్చి ఉంటే ఈపాటికి జీవితంలో బాగా సెటిల్ అయ్యేదాన్ని అని తెలిపారు. కానీ నాకు అలా ఇష్టం ఉండదని ఏదైనా నేను సొంతంగా కష్టపడి సంపాదించుకొని సంతోషపడతానని వెల్లడించారు. నాకు సినిమాలంటే ఆసక్తి ఉన్నప్పటికీ ఎవరు అవకాశాలు ఇవ్వలేదు అయినా నేను వెనకడుగు వేయలేదు గతంలో నా గాజులను(Bangles) అమ్ముకొని సామి సామి(Sami Sami song) అనే కవర్ సాంగ్ చేశాను ఆ పాట మంచి సక్సెస్ కావడంతో నాకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయని తెలిపారు.
ఇలా ఈ పాట ద్వారా ఒక సినిమా అవకాశం అందుకున్న తనకు అవకాశాలు రాలేదని, అవకాశాల కోసం కమిట్మెంట్స్ ఇచ్చే రకం తాను కాదని తెలిపారు అవసరమైతే తన కిడ్నీలు(Kidneys) అమ్ముకొని అయినా వచ్చిన డబ్బుతో సినిమా చేస్తాను కానీ సినిమాలు చేయకుండా మాత్రం ఆగనని వెల్లడించారు. ఇలా సినిమాలపై ఆసక్తితో సినిమా చేయడం కోసం తన కిడ్నీలు కూడా అమ్ముకోవడానికి తాను సిద్ధమే అంటూ ఈమె మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారాయి. ప్రతి ఒక్క విషయంలో తాను ఎంతో నిజాయితీ నిబద్ధతగా ఉంటాను అందుకే నా దగ్గర పెద్దగా డబ్బు లేదని వెల్లడించారు.
ముక్కు మొఖం తెలియని వారికి అవకాశాలు..
ఇక ప్రస్తుతం రేఖా భోజ్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల ఎవరైనా దర్శక నిర్మాతలు స్పందించి ఈమెకు అవకాశాలు ఇస్తారా లేదంటే గాజులు అమ్మిన విధంగానే కిడ్నీలు కూడా అమ్ముతుందా అంటూ అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈమె కెరియర్ విషయానికి వస్తే.. లవ్ ఇన్ వైజాగ్ (Love In Vizag)అనే షార్ట్ ఫిలిం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రముఖ యూట్యూబ్ షణ్ముఖ్ జస్వంత్ తో కలిసి ఈ షార్ట్ ఫిలిం చేసి మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు అనంతరం డర్టీ పిక్చర్ అనే మరో షార్ట్ ఫిలిం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక సినిమాల విషయానికొస్తే రేఖ కాలాయా తస్మై నమః అని సినిమాలో నటించారు. ఇక బిగ్ బాస్ కార్యక్రమం గురించి ఈమె ఇటీవల మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను గత నాలుగు సంవత్సరాలుగా బిగ్ బాస్ షోలో పాల్గొనాలని ప్రయత్నం చేస్తున్న ముక్కు మొహం తెలియని వారికి అవకాశాలు ఇస్తున్నారు తప్ప నన్ను మాత్రం రిజెక్ట్ చేశారంటూ విమర్శలు కురిపించారు.
Also Read: Jatadhara Trailer: మంత్ర బంధనాలతో ‘జటాధర’.. ఆకట్టుకుంటున్న ట్రైలర్!