HYDRA: హైడ్రా వచ్చాక హైదరాబాద్ మహా నగరం సస్య శ్యామలంగా మారుతోంది. నగరంలో ఎక్కడ ఆక్రమణలు ఉన్నా వెంటనే ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటుంది. తాజాగా గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని కుల్సుంపుర గ్రామంలో హైడ్రా అధికారులు నగరం నడిబొడ్డున ఉన్న సుమారు రూ. 110 కోట్ల విలువైన 1.30 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని ఆక్రమణలను తొలగించారు.
గోషామహల్ నియోజకవర్గం ఆసిఫ్ నగర్ మండలం కుల్సుంపూర్ విలేజ్‌లోని సర్వే నంబర్ 50 లో గల భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆశోక్ సింగ్ అనే వ్యక్తి ఈ భూములను ఆక్రమించాడు. 1.30 ఎకరాల భూమి విలువ సుమారు రూ. 110 కోట్ల విలువ ఉంటుంది. ఇతను ఈ ప్రభుత్వ భూమిని ఆక్రమించి, అందులో షెడ్లు వేసి విగ్రహ తయారీదారులకు అద్దెకు ఇస్తున్నాడు. అయితే.. హైదరాబాద్ కలెక్టర్ అభ్యర్థన మేరకు.. అలాగే స్థానికులు కూడా ప్రజావాణిలో హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో అధికారులు కబ్జాపై దృష్టి సారించారు.
ALSO READ: EMRS Jobs: 7267 ఉద్యోగాలు బ్రో.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, కొంచెం కష్టపడితే జాబ్ మీదే
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌గ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులతో కలిసి హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, శుక్రవారం ఆక్రమణలను తొలగించారు. ఈ భూమి తనదేనంటూ అశోక్ సింగ్ గతంలో సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించగా.. కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పింది. ఈ భూమిని ఖాళీ చేయించేందుకు రెవెన్యూ అధికారులు ఇప్పటికే రెండు సార్లు ప్రయత్నించినా, అశోక్ సింగ్ స్థలం ఖాళీ చేయకుండా అద్దెలు తీసుకుంటూ.. ఖాళీ చేయించేందుకు ప్రయత్నించిన అధికారులపై దాడులకు పాల్పడ్డాడు.
ALSO READ: Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు.. బీజేపీ సైలెంట్ రాజకీయాలకు సంకేతమేంటి..?
అశోక్ సింగ్‌పై లంగర్‌హౌస్, మంగళహాట్, శాహినాయత్ గంజ్ పోలీసు స్టేషన్లలో భూ కబ్జాదారుడుగా, రౌడీ షీటర్‌గా 8కి పైగా కేసులు ఉన్నాయి. ప్రజావసరాలకు ఈ విలువైన భూమిని వినియోగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. గజం స్థలం కూడా దొరకని కుల్సుంపుర ప్రాంతంలో పేదల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించడానికి ప్రభుత్వం ప్రతిపాదనలు చేస్తోంది. ఈ ప్రభుత్వ భూమికి ఆనుకుని ఉన్న ప్రాంతంలో ఇప్పటికే ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి, ఫెన్సింగ్ పనులు కూడా పూర్తి చేసింది.