ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ పర్యటనలో ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారులు కొన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అయితే పవన్ వారి సమస్యలను పరిష్కరించేందుకు 100 రోజుల గడువు కావాలన్నారు. సమస్యలు విన్న వెంటనే పరిష్కరిస్తానని తాను హామీ ఇవ్వట్లేదని, తనకు గడువు కావాలని కోరారు. మీరు నాకు గడువు ఇస్తున్నారా అంటూ వారినే అడిగి మరీ ఆయన అక్కడ్నుంచి బయలుదేరి వెళ్లారు. ఆ తర్వాత ఆ గడువుకి తగ్గ విధంగా కార్యాచరణ రూపొందించారు.
మత్స్యకారుల జీవితాల్లో మెరుగైన మార్పులు తీసుకువచ్చేలా ప్రణాళిక
• వేట సామర్థ్యం పెంపొందించడం, అదనపు ఆదాయ సముపార్జనపై దృష్టి
• 100 రోజుల ప్రణాళిక అమలుపై ఉప ముఖ్యమంత్రి @PawanKalyan సమీక్షా సమావేశం
• సీఎంఎఫ్ఆర్ఐ ప్రధాన శాస్త్రవేత్తలు, రాష్ట్ర అధికారులు, కాకినాడ జిల్లా కలెక్టర్,… pic.twitter.com/MUmK4WeVN0
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) October 17, 2025
100 డేస్..
సమస్యల పరిష్కారానికి 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై ఈరోజు పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మత్స్యశాఖ ఉన్నతాధికారులు, మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (CMFRI), విశాఖ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. రాష్ట్ర అధికారులు, కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా ఈ సమీక్షకు హాజరయ్యారు. ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో సదుపాయాలు కల్పించాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. వారి జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ఉన్న అవకాశాలు అన్వేషించాలని సూచించారు. చేపల వేటలో మత్స్యకారులకు మెలకువలు నేర్పడం, వారి నైపుణ్యం పెంచడంతోపాటు తగిన సౌకర్యాలు కల్పించాలని.. వాటిపై అధికారులు దృష్టి సారించాలని తెలిపారు.
మత్స్య సంపద ఎలా పెంచాలి?
మత్స్యకారుల్లో నైపుణ్యం పెంచినా, మత్స్య సంపద పెరిగితేనే వారికి ఆదాయం పెరుగుతుంది. ఈ క్రమంలో మత్స్య సంపదను పెంపొందించడం తదితర అంశాలపై విశాఖ CMFRI ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జోయ్ కె. కిజాకుడాన్ సలహాలు, సూచనలు తీసుకున్నారు పవన్ కల్యాణ్. ఆయన సూచనలను అమలు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ కు సూచించారు. మత్స్యకారుల జీవితాల్లో మెరుగైన మార్పులు తీసుకువచ్చేలా ప్రణాళిక రూపొందంచాలన్నారు.
Also Read: లోకేష్ కోడి-గుడ్డు కామెంట్స్
ఏపీ డిప్యూటీసీఎంగా రాష్ట్రవ్యాప్తంగా తన పనితీరుతో పవన్ ఆకట్టుకుంటున్నారని జనసేన నేతలు అంటున్నారు. అదే సమయంలో పిఠాపురం నియోజకవర్గంపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. తన పార్టీ నేతలకు ఆ పని పురమాయించారు. వారితోపాటు తాను కూడా నియోజకవర్గ సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపుతున్నారు. ముఖ్యంగా పిఠాపురంలో మత్స్యకారుల సమస్యలు చాలా ఉన్నాయి. ఉప్పాడ తీరం కోతకు గురవుతున్న క్రమంలో కేంద్ర నిధులతో అక్కడ రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేసేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. ఇక మత్స్యకారులకు ఇబ్బందిగా ఉన్న వివిధ కంపెనీలపై కూడా పవన్ దృష్టిసారించారు. మత్స్యకారుల ఆదాయం పెరిగే మార్గాలను అణ్వేషించాలని అధికారులను ఆదేశించారు.
Also Read: జగన్ పులివెందులకు ఇచ్చిందేంటి? చంద్రబాబు విశాఖకు తెచ్చిందేంటి?
గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారనే వార్త రావడం దగ్గర్నుంచీ పిఠాపురం నియోజకవర్గం ప్రతి రోజూ వార్తల్లో నిలుస్తోంది. అక్కడ వర్మ లాంటి బలమైన టీడీపీ నేత ఉన్నా కూడా పవన్ కల్యాణ్ తనదైన శైలిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. జనసేన క్యాడర్ ని పెంచుకుంటున్నారు, పార్టీని బలోపేతం చేసుకుంటున్నారు. ముఖ్యంగా మత్స్యకార వర్గాల్లో పవన్ కి మంచి క్రేజ్ ఉంది. వారే పార్టీకి ప్రధాన బలంగా మారుతున్నారు.
Also Read: ప్రధాని మోదీని వైసీపీ నేతలు కలిశారా లేదా?