Sreemukhi (Source: Instagram)
బుల్లితెరపై పలు షోలు చేస్తూ తన అద్భుతమైన వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటున్న ప్రముఖ యాంకర్ శ్రీముఖి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
Sreemukhi (Source: Instagram)
పటాస్ షో ద్వారా ఇండస్ట్రీలోకి యాంకర్ గా అడుగుపెట్టిన శ్రీముఖి, ఆ తర్వాత పలు షోలు చేస్తూ భారీ పాపులారిటీ అందుకుని, బిగ్ బాస్ లో కూడా సత్తా చాటింది.
Sreemukhi (Source: Instagram)
ప్రస్తుతం పలు షోలకు హోస్టుగా వ్యవహరిస్తున్న ఈమె .. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రోజుకొక ఫోటో షేర్ చేస్తూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది.
Sreemukhi (Source: Instagram)
అందులో భాగంగానే తాజాగా దేవకన్యను తలపించేలా అద్భుతమైన ఫోటోలు షేర్ చేసి ఆకట్టుకుంది. లెహంగాలో చూడ ముచ్చటగా కనిపించి, అప్సర అసలు సైతం తలదించుకునేలా అందాలతో ఆకట్టుకుంది.
Sreemukhi (Source: Instagram)
డిజైనర్ గ్రీష్మ కృష్ణ. కే డిజైన్ చేసిన అవుట్ ఫిట్ ధరించి అందరిని అబ్బురపరిచింది. ముఖ్యంగా ప్రింటెడ్ యాష్ కలర్ లెహంగాపై మ్యాచింగ్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ధరించి అందాలతో కట్టిపడేసింది.
Sreemukhi (Source: Instagram)
దానికి మ్యాచింగ్ గా జువెలరీ ధరించింది. ప్రస్తుతం శ్రీముఖి షేర్ చేసిన ఈ లెహంగా ఫోటోలు, అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
475383126_18491390221052139_2837020006923590117_n
475588388_18491390212052139_5898658937233195443_n
475310106_18491390197052139_6765349046721127870_n
475568889_18491390164052139_1782371946916096732_n