CP Sajjanar : ప్రముఖ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధావన్ (Shikhar Dhavan) పై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ( sajjanar) సీరియస్ అయ్యారు. ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో వీరికి చెందిన రూ. 11 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. అయితే ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయింది. ఆ వార్తకు సీపీ సజ్జనార్ కామెంట్ పెట్టారు. ” వీళ్లేం సెలబ్రిటీలు? అభిమానాన్ని కూడా సొమ్ము చేసుకునే వీళ్లు ఆదర్శనీయమైన ఆటగాళ్లు ఎలా అవుతారు? బెట్టింగ్ మహామ్మారికి వ్యసనపరులై ఎంతో మంది యువకులు తమ జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. వేలాది మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. సమాజాన్ని ఛిద్రం చేస్తోన్న బెట్టింగ్ భూతాన్ని ప్రచారం చేసిన వీరు వీటన్నింటికీ బాధ్యులు కారా? సమాజ మేలు కోసం, యువత ఉన్నతస్థానాలకు చేరుకోవడానికి నాలుగు మంచి మాటలు చెప్పండి.. అంతేకానీ మిమ్ముల్ని అభిమానించే వాళ్లను తప్పుదోవపట్టించి వారి ప్రాణాలను తీయకండి” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సజ్జనార్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read : Cm Revanth Reddy: హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ స్టేడియం..ఆస్ట్రేలియా తరహాలో బౌన్సీ పిచ్ లు
ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ కి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్ కి చెందిన రూ.11.14 కోట్లు విలువైన ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి మాజీ క్రికెటర్లు రాబిన్ ఉతప్ప, యువరాజ్ సింగ్ వంటి క్రికెటర్లతో పాటు నటీనటులు సోనూ సూద్, ఊర్వశీ రౌతేలా, మిమి చక్రవర్తి( తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ), అంకుశ్ హజ్రా (బెంగాళీ నటుడు) ని గతంలోనే ఈడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయితే ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ నకు సంబంధించి మనీ లాండరింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ.. ఈ ఇద్దరూ మాజీ క్రికెటర్లు అన్ని విషయాలు తెలిసే 1xBet దాని అనుబంధ సంస్థల ప్రమోషన్ కోసం విదేశీ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారని గుర్తించింది.
ఈ నేపథ్యంలోనే శిఖర్ ధావన్ కి సంబంధించి రూ.4.5 కోట్లు స్థిరాస్తిని, సురేష్ రైనా కు చెందిన రూ.6.64 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్ లను సీజ్ చేసేందుకు మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఉత్తర్వులు జారీ చేశారు. దేశవ్యాప్తంగా అక్రమ బెట్టింగ్ యాప్‌లను ఈడీ లక్ష్యంగా చేసుకుంది. వివిధ రాష్ట్రాలలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా దర్యాప్తు చేస్తుంది. ఆయా బెట్టింగ్ యాప్‌లతో ప్రముఖుల ఎండార్స్‌మెంట్ ఒప్పందాలు, వినియోగదారులను యాప్‌లు మోసం చేయాలనే ఆరోపణలు, పన్ను ఎగవేతపై ఈడీ లోతైన దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలోనే బెట్టింగ్ ప్లాట్‌ఫామ్ 1xBet తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ దర్యాప్తుకు సంబంధించి భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్‌కు ఈడీ గతంలోనే సమన్లు జారీ చేసింది. టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనాను కూడా ఇదే కేసులో ఎనిమిది గంటలకు పైగా ఈడీ ప్రశ్నించింది.
Also Read : BBL New Rule : BBLలో కొత్త రూల్స్…ఇకపై బంతి తాకితే అభిమానులకే, త్వరలో ఐపీఎల్ లో కూడా
వీళ్లేం సెలబ్రిటీలు?
అభిమానాన్ని కూడా సొమ్ము చేసుకునే వీళ్లు ఆదర్శనీయమైన ఆటగాళ్లు ఎలా అవుతారు?
బెట్టింగ్ మహామ్మారికి వ్యసనపరులై ఎంతో మంది యువకులు తమ జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. వేలాది మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. సమాజాన్ని… pic.twitter.com/GWJIvSK7uF
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 7, 2025