Minister Sridhar babu: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసేందుకు తమకు ఐదేళ్ల చాలని, పదేళ్ల కాలవ్యవధి అవసరం లేదంటూ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు దావోస్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సంధర్భంగా భారీగా పెట్టుబడులు తెచ్చిన విషయం కూడ తెలిసిందే. అయితే ఈ పర్యటన గురించి మీడియాతో చిట్ చాట్ గా మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు మంత్రి.
మంత్రి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేళ్లు పాలన సాగినా, ఒకేసారి ఇంత మొత్తంలో పెట్టుబడులు తెలంగాణకు రాలేదన్నారు. ఏపీ ప్రభుత్వం చాలా పెద్ద ప్రణాళికతో దావోస్ పర్యటనకు వచ్చిందని, భవిష్యత్తులో ఏపీకి మంచి పెట్టుబడులు వస్తాయంటూ మంత్రి జోస్యం చెప్పారు. తెలంగాణకు అధిక సంఖ్యలో పెట్టుబడులు రావడానికి గల కారణం ఎనర్జీ పాలసీ తీసుకు రావడమేనంటూ మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఒక్కొక్క డేటా సెంటర్ ఏర్పాటుకు 5 నుండి 10 ఎకరాలు అవసరం అవుతాయని, అందుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ సాగుతుందన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో 5 సంవత్సరాలలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసి తీరుతామని, తమకు పదేళ్లు అవసరం లేదంటూ మంత్రి పునరుద్ఘాటించారు. అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ గురించి మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్ కంటే ట్రంప్ పెద్ద మాయగాడంటూ అభివర్ణించారు. కేసీఆర్ ఎన్నికలకు ఏం కావాలో అదే మాట్లాడారని, కానీ ట్రంప్ భిన్నరీతిలో మాట్లాడినట్లు మంత్రి అభిప్రాయపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దావూస్ పర్యటనలో ఎక్కడ కూడా ఏకపక్షంగా మాట్లాడలేదంటూ మంత్రి అన్నారు.
Also Read: Prakasam Crime: అన్నా నువ్వే దిక్కని వస్తే.. పక్కా ప్లానేసి మరీ చంపేశాడు
ఫిబ్రవరి 7 తారీఖున అతి పెద్ద ప్రకటన ఉంటుందని మంత్రి ఈ సందర్భంగా చెప్పడం విశేషం. చర్లపల్లి వద్ద రెండు పెద్ద షాపింగ్ మాల్స్ నిర్మిస్తామన్నారు. ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ తెచ్చిన పాలసీలను ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ తీసుకుని వెళుతున్నారని, అయితే ఆ పాలసీలను ఒక్కరే ఒక్కరు ఆపారంటూ మంత్రి చెప్పారు. అదికూడా ఏపీ గత ముఖ్యమంత్రి జగన్ మాత్రమే.. అటువంటి ధోరణితో పాలను సాగించారన్నారు. రాష్ట్రంలో నూతన రేషన్ కార్డులు అందించడం పై ప్రజలు సంతోషంగా ఉన్నారని, అభివృద్ధి పరంగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో తాము పోటీ పడాలని అనుకుంటున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.