Bigg Boss 9: బిగ్ బాస్ 9 లో చాలామందికి ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనగానే మొదట వినిపించలేరు ఇమ్మానియేల్. జబర్దస్త్ షో తో విపరీతమైన గుర్తింపు సాధించుకున్నాడు. అయితే జబర్దస్త్ లో చేసిన విధంగానే కామెడీ హౌస్ లో కూడా చేస్తున్నాడు. చాలామందికి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు దీనిలో ఎటువంటి సందేహం లేదు. అందుకే ఎక్కువ శాతం మంది ఆడియన్స్ వచ్చినపుడు కూడా ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనగానే ఇమ్మానియేల్ పేరు పక్కన వినిపిస్తుంది.
ఇమ్మానుయేల్ గేమ్ బాగా ఆడతాడు, అందర్నీ ఎంటర్టైన్ చేస్తాడు అని అందరూ చెబుతూ ఉంటారు అది వాస్తవమే. కానీ ఇమ్మానియేల్ ఎక్కడో ఇన్ సెక్యూరిటీ ఫీల్ అవుతున్నాడు అని చాలామంది క్లియర్ గా అబ్జర్వ్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. తనకంటే గేమ్ ఎవరూ బాగా ఆడినా కూడా పెద్దగా తీసుకోలేడు.
ఇప్పటివరకు హౌస్ లో రెండుసార్లు ఇమ్మానుయేల్ కెప్టెన్ అయ్యాడు. 8 వారాల నుంచి అసలు నామినేషన్స్ లో లేడు. కానీ ఇప్పటికీ కూడా కెప్టెన్సీ కోసం పోరాడుతూనే ఉన్నాడు. ఇంత కష్టపడి ఆడుతుండడం అనేది ఒక రకంగా మంచిదే, కానీ మోస్ట్ సేఫ్ ప్లేయర్ అనే టైటిల్ కి కూడా తన ఆట తీరు న్యాయం చేస్తుంది.
హౌస్ మేట్స్ లో పెద్దగా ఎవరితో కూడా గొడవ పడకూడదు అని బహుశా నిర్ణయించుకుని ఉన్నట్లు ఉన్నాడు. అవసరం అయితే తప్ప గట్టిగా అరవడు. ముఖ్యంగా ఇంతకుముందు నామినేషన్ టికెట్లు ఆరు దొరికినప్పుడు ఆరుగురికి పని చేశాడు తప్ప ఒకటి కూడా తన దగ్గర ఉంచుకోలేదు.
ఒకటి తన దగ్గర ఉంచుకొని ఎవరినైనా నామినేషన్ చేస్తే కారణాలు చెప్పాలి. అలా ఒకరిని నామినేషన్ చేసి కారణాలు చెబితే అవతల వాళ్ళు రివర్స్లో ఆర్గ్యుమెంట్ మొదలెడతారు. ఒకరకంగా వాళ్ళతో ఇమ్మానుయేల్ కు ఫైట్ జరుగుతుంది. అందుకే ఒకరకంగా చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు.
అయితే ఆ ఫియర్ కూడా పక్కకు పెట్టి గేమ్ ఆడితే ఇంకా ఇమ్మానుయేల్ కి అభిమానులు పెరిగే అవకాశం ఉంది. మేనేజ్మెంట్ తనుజాకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి టైటిల్ విషయంలో ఇమ్మానుయేల్ కి చెప్పలేము గాని టాప్ ఫైవ్ లో ఉండే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది అని ఈజీగా అర్థమయిపోతుంది.
Also Read: Comedian Satya: హీరోగా మారిన కమెడియన్ సత్య , రితేష్ రానా మాస్ ప్లాన్