Andhra King Taluka : ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని సక్సెస్ కొట్టి చాలా ఏళ్ళు అయిపోయింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఇప్పటివరకు ఊహించిన రేంజ్ సక్సెస్ రాలేదు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన స్కంద సినిమా కూడా అంతంత మాత్రమే ఆడింది. డబుల్ ఇస్మార్ట్ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంటారు అని ఊహించారు కానీ ఆ సినిమా పూరీకి, అలానే రామ్ కి కూడా షాక్ ఇచ్చింది.
మహేష్ బాబు దర్శకత్వంలో ప్రస్తుతం రామ్ ఆంధ్ర కింగ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో రా మంచి సక్సెస్ అందుకుంటాడు అని అందరూ ఊహిస్తున్నారు. నవంబర్ 28న ఈ సినిమా విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఆల్రెడీ పూర్తయిపోయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జెట్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ సినిమాకి సంబంధించిన లిరికల్ వీడియోతో పాటు ట్రైలర్ కూడా రెడీ చేస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి మొత్తం మూడు పాటలు విడుదలయ్యాయి. మూడు పాటలు కూడా మంచి సక్సెస్ సాధించాయి. ఈ సినిమాలో రామ్ మొదటి సారి ఒక పాటను కూడా రాశారు. ఈ సినిమాలో సెకండ్ సాంగ్ స్వయంగా రామ్ పాడారు.
సినిమా నుంచి విడుదలైన మూడవ సాంగ్ కూడా విపరీతంగా ఆకట్టుకుంటుంది. కంటెంట్ అంతా కూడా అద్భుతంగా ఉంది. సినిమా ఎలా ఉండబోతుందో రిలీజ్ తర్వాత తెలుస్తుంది.
చాలామంది హీరోలకి అభిమానులు ఉండటం అనేది సహజంగానే జరుగుతుంది. అయితే అభిమానుల యొక్క ఎమోషన్ పట్టుకొని ఇప్పటివరకు ఎవరు సినిమా తీయలేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన నేనింతే సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేదు. కానీ ఆ సినిమాలో అభిమానులు ఎలా ఉంటారో అని కొద్దిపాటి అంశాలను టచ్ చేశాడు పూరి జగన్నాథ్. ఇక ఈ సినిమాలో పూర్తిస్థాయిలో ఆ పాయింట్ ను పట్టుకున్నాడు. కన్నడ నటుడు ఉపేంద్ర ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపిస్తున్నారు.
దర్శకుడు మహేష్ బాబు (Mahesh Babu P) మిస్సెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు. అటువంటి సక్సెస్ఫుల్ సినిమా తర్వాత మహేష్ బాబు దర్శకత్వంలో ఈ సినిమా వస్తుంది కాబట్టి చాలామందికి మంచి అంచనాలు నెలకొన్నాయి.
Also Read: Comedian Satya: హీరోగా మారిన కమెడియన్ సత్య , రితేష్ రానా మాస్ ప్లాన్