మహారాష్ట్రలో షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. థానేలో రెండేళ్ల చిన్నారి 13వ అంతస్తు బాల్కనీ నుంచి పడింది. పాప పై నుంచి కిందపడుతున్న విషయాన్ని గమనించిన ఓ వ్యక్తి వేగంగా ముందుకు పరిగెత్తి వెళ్లి చిన్నారిని పట్టుకునే ప్రయత్నం చేశాడు. పూర్తిగా చిన్నారిని పట్టుకోలేకపోయినా, బలంగా నేలకు తగలకుండా అడ్డుకున్నాడు. చిన్నారి స్వల్ప గాయాలతో బయటపడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వ్యక్తిని రియల్ హీరో అంటూ అందరూ పొగడ్తలు కురిపిస్తున్నారు.
ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?
ఈ ఘటన థానే జిల్లాలోని డోంబిలివి దేవిచాపాడ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ఓ 13 అంతస్తుల భవంతి ఉంది. ఈ అపార్ట్ మెంట్ లో చాలా మంది జీవనం కొనసాగిస్తున్నారు. ఆదివారం నాడు అందరూ ఇంట్లోనే ఉండగా రెండేళ్ల చిన్నారి బయటకు వచ్చింది. బాల్కనీలో ఆడుకుంటూ జారిపడిపోయింది. అదే అపార్ట్ మెంట్ లో ఉంటున్న భవేష్ మాత్రే అనే వ్యక్తి.. కిందికి వచ్చాడు. ఫ్రెండ్స్ తో మాట్లాడుడూ పాప బాల్కనీ నుంచి పడిపోవడాన్ని గమనించాడు. వేగంగా వెళ్లి చిన్నారని పట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ, చిన్నారి స్పీడ్ గా రావడంతో ఆ బరువును ఆపలేకపోయాడు. అయితే, నేరుగా కిందపడకుండా ఆపగలిగాడు. ప్రమాద తీవ్రతను తగ్గించాడు. చిన్నారికి కేవలం చిన్న చిన్న గాయాలు అయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు పాపను హాస్పిటల్ కు తీసుకెళ్లగా, పెద్దగా గాయాలేమీ జరగలేదని డాక్టర్లు చెప్పారు. చిన్న చిన్న గాయాలకు చికిత్స చేసి.. ఇంటికి పంపించారు.
वह दौड़कर पहुंचा और बच्चे को भूमि पर गिरने से पहले ही उसको लपक लिया।#मैं_डरूँगा_नहीं pic.twitter.com/PH6rL0p75h
— DDN Chhattisgarh (@DdnChhattisgarh) January 27, 2025
Read Also: ఇష్టం లేని పెళ్లి.. వరుడికి చుక్కలు చూపించిన వధువు, నెట్టింట వీడియో వైరల్!
రియల్ హీరో అంటూ ప్రశంసిస్తున్న నెటిజన్లు
భవేష్ మాత్రే చిన్నారిని పట్టుకుంటున్న వీడియో అపార్ట్ మెంట్ సమీపంలోని సీసీటీవీలో రికార్డు అయ్యింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి ప్రతి ఒక్కరు భవేష్ మాత్రే స్పందించిన తీరును ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. భవేష్ అంత వేగంగా వెళ్లి చిన్నారని పట్టుకుని పోయి ఉండకపోతే, ప్రాణాలతో ఉండేది కాదంటున్నారు. అతడు చూపించిన సమయ స్ఫూర్తి ఓ నిండు ప్రాణాన్ని కాపాడిందని ప్రశంసిస్తున్నారు. రియల్ హీరో అంటూ కొనియాడుతున్నారు. ఇక ఈ ఘటనపై స్పందించిన భవేష్ మాత్రే.. పాప ప్రాణాలు కాపాడ్డం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. తనకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఎంతో ఇష్టమన్నారు. రోజూ క్రికెట్ ఆడతానని వెల్లడించాడు. ఆ ఫిట్ నెస్ కారణంగానే వేగంగా వెళ్లి పాపను పట్టుకునే ప్రయత్నం చేశానని చెప్పారు. చిన్నారి బరువును ఆపలేకపోవడం వల్లే చిన్నారి పడిపోయిందన్నారు. అయినప్పటికీ, తను ప్రాణాలతో బయటపడిందన్నారు. తాను పట్టుకుని ఉండకపోతే అదే వేగంతో కిందపడితే చిన్నారని స్పాట్ లోనే ప్రాణాలు కోల్పేయే అవకాశం ఉండేదన్నారు. తాను చేసిన చిన్న ప్రయత్నం ఓ నిండు కుటుంబంలో సంతోషాన్ని నింపిందన్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో బోలెడు వ్యూస్ సాధించింది.
Read Also: విద్యార్థి పట్ల ప్రిన్సిపల్ కర్కశత్వం.. శానిటరీ ప్యాడ్ అడిగిందని ఏం చేశారో తెలుసా?