Dheeraj Mogilineni: ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు ప్రతి ఒక్క సినిమా కూడా సీక్వెల్ సినిమాలను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న సినిమాలకు దర్శక నిర్మాతలు సీక్వెల్స్ ప్రకటిస్తున్నారు. అలాగే గతంలో హిట్ అయిన సినిమాలకు కూడా ఇప్పుడు సీక్వెల్ చేయబోతున్నట్లు ప్రకటనలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సీక్వెల్ సినిమాలపై ప్రముఖ నిర్మాత ధీరజ్ మొగిలినేని(Dheeraj Mogilineni) మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ధీరజ్ నిర్మాణంలో రష్మిక (Rashmika), దీక్షిత్ శెట్టి(Deekshith Shetty) ప్రధాన పాత్రలలో నటించిన ది గర్ల్ ఫ్రెండ్(The Girl Friend) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
ఇలా ఈ సినిమాకు మంచి ఆదరణ వచ్చిన నేపథ్యంలో చిత్ర బృందం ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మీడియా వారి నుంచి నిర్మాత ధీరజ్ కు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. ది గర్ల్ ఫ్రెండ్ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నారా అంటూ ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు ధీరజ్ సమాధానం చెబుతూ సీక్వెల్ సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీక్వెల్ సినిమాలు అంటే పోయిన డబ్బును తిరిగి రాబట్టే సినిమాలని ఈయన షాకింగ్ కామెంట్స్ చేశారు.
మా సినిమాకు అవసరం రాదని ధీరజ్ వెల్లడించారు. పోయిన డబ్బును తిరిగి పిండుకోవడం కోసం సీక్వెల్ సినిమాలను చేస్తాము కానీ ది గర్ల్ ఫ్రెండ్ సినిమా అనేది ఒక లైబ్రరీ లాంటి సినిమా, ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందా? లేదా? అనేది నాకు కూడా తెలియదని, డబ్బుల కోసం అయితే సీక్వెల్ తీసే సినిమా కాదు ఇది అంటూ ఈయన మాట్లాడిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇలా నిర్మాత చేస్తున్న ఈ వ్యాఖ్యలపై విభిన్న రీతిలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోలందరూ కూడా సీక్వెల్ సినిమాల పనులలో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.
రష్మిక ఖాతాలో మరో హిట్…
ఇక రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా కాలేజీ బ్యాక్ డ్రాప్ లో లవ్ రొమాంటిక్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా రష్మిక మరొక సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ సినిమాకు ప్రముఖ నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించగా ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడు నిర్మాతలుగా వ్యవహరించారు. అలాగే గీత ఆర్ట్స్ సమర్పణలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు మంచి టాక్ వచ్చిన నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ సినిమాని హిట్ చేసిన ప్రేక్షకులకు మీడియాకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
Also Read: Samantha: మరి అంత చనువేంటీ సమంత ..కాస్త గ్యాప్ ఇవ్వచ్చుగా .. ఆ హగ్గులేంటీ!