Bigg Boss 9: బిగ్ బాస్ 9 సీజన్ మొదలైనప్పటి నుంచి చదరంగం కాదు రణరంగం అంటూ చెబుతూ వస్తున్నారు. కానీ ఆ స్థాయిలో మాత్రం సీజన్ లేకుండా పోయింది. హౌస్ లో ప్లేయర్స్ ఎవరూ కూడా సరిగ్గా ఆకట్టుకోవడం లేదు. ప్రస్తుతం ఉన్న వాళ్ళలో పవన్ కొంతవరకు గేమ్ బాగా ఆడుతున్నాడు. కొందరు గేమ్ ఆడటం తగ్గించి బంధాలు బాంధవ్యాల మీద సాగిపోతున్నారు. చీటికిమాటికి అరుచుకోవడం. ఊరికే ఏడవడం ఎక్కువగా ఈ సీజన్ లో కనిపిస్తున్నాయి.
ఒకప్పుడు ఎపిసోడ్ కేవలం గంట మాత్రమే వచ్చేది. సీజన్ పెరిగేకొద్దీ 24 గంటలు కూడా చూసే అవకాశం ఉండేలా సోను ప్లాన్ చేశారు. అయితే ఇలా ప్లాన్ చేయటం వల్లనే చాలామందికి ఎక్కువ విషయాలు తెలుస్తున్నాయి. బిగ్బాస్ యాజమాన్యం ఎవరికి సపోర్ట్ చేస్తుందో అర్థమవుతుంది. చాలామందికి తను జాను బిగ్బాస్ మేనేజ్మెంట్ సపోర్ట్ చేస్తుంది అనే విషయం ఆల్రెడీ అర్థమైపోయింది.
సోషల్ మీడియాలో బిగ్ బాస్ కు సంబంధించి వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అయితే కొంతమంది ఆ వీడియోలు తో ఎలివేషన్ పోస్టులు వేస్తారు. మరి కొంతమంది ఆ వీడియోలు ట్రోల్ చేయడం మొదలుపెడతారు.
కెప్టెన్సీ కోసం రీతు చౌదరి, ఇమ్మానుయేల్, తనుజ మిగిలిన విషయం తెలిసిందే. అయితే దివ్యవెలమూరి కెప్టెన్సీ కంటెండర్ గా తనుజాను తొలగించింది. ఇమ్మానుయేల్ గెలవాలి అని నేను కోరుకుంటున్నాను కాబట్టి నిన్ను తొలగిస్తున్నాను అంటూ రీజన్ చెప్పింది.
ఈ మాటతో ఒక్కసారిగా తనుజ భరణిని ఇన్వాల్వ్ చేస్తూ దివ్యతో ఆర్గ్యుమెంట్ చేసింది. ఆర్గుమెంట్ అయిపోయిన తర్వాత ఒక్కసారిగా ఏడుస్తూ బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయింది. కొంతమంది వచ్చి తనను ఓదార్చే ప్రయత్నం చేశారు.
కొందరు ఈ వీడియోను వైరల్ చేస్తూ ఈ ఏడుపుగొట్టు మొహాలను బయటకు తోసేయండి లైవ్ చూడలేకపోతున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ ఇంతకుముందు జరిగిన సీజన్ లో వాళ్ళు మాట్లాడుకునే మాటలు బట్టి, ప్రవర్తించే తీరును బట్టి కొంతమేరకు షో మీద ఆసక్తి ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఇలా ఏడుస్తుంటే చాలామంది వీక్షకులకు చిరాకు ఇస్తుంది. అలానే పోస్ట్ నాగార్జున మీద కూడా విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.
Also Read: Bigg Boss 9: ఇన్ సెక్యూరిటీ లోకి పోయి గేమ్ పాడు చేసుకుంటున్నా ఇమ్మానియేల్