Anu Emmanuel (Source: Instagram)
అనూ ఇమ్మాన్యుయేల్.. 1997 మార్చి 28న జన్మించిన ఈమె చలనచిత్ర నటిగా పేరు సొంతం చేసుకుంది. మలయాళం లో వచ్చిన స్వప్న సంచారి అనే మలయాళ చిత్రం ద్వారా బాలనటిగా పరిచయమైంది.
Anu Emmanuel (Source: Instagram)
ఈమె యాక్షన్ హీరో బిజు అనే మలయాళం చిత్రం ద్వారా హీరోయిన్ గా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత గోపీచంద్ హీరోగా వచ్చిన ఆక్సిజన్ అనే చిత్రంలో నటించడానికి ఒప్పుకుంది. కానీ ఈ సినిమా షూటింగ్స్ సమయంలోనే నాని సరసన మజ్ను అనే చిత్రంలో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Anu Emmanuel (Source: Instagram)
అయితే ఆక్సిజన్ కంటే ముందే మజ్ను సినిమా ముందుగా విడుదల కాగా.. ఈమె పాత్ర , నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి.
Anu Emmanuel (Source: Instagram)
ఇక తర్వాత నా పేరు సూర్య, అజ్ఞాతవాసి, గీతగోవిందం, శైలజా రెడ్డి అల్లుడు, అదుర్స్, ఊర్వశివో రాక్షసివో అంటూ పలు చిత్రాలలో నటించిన ఈమె చివరిసారిగా జపాన్ అనే తమిళ్ సినిమాలో కనిపించింది.
Anu Emmanuel (Source: Instagram)
ఇకపోతే ఇండస్ట్రీకి దూరమైన ఈమె అటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా లేదనే చెప్పాలి. కానీ ఇప్పుడు తాజాగా ఫోటోలు షేర్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది.
Anu Emmanuel (Source: Instagram)
ఇందులో చాలా బక్కగా గుర్తుపట్టలేనంతగా మారిపోయి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈమెను చూసిన అభిమానులు ఏంటి అనూ ఇంత బక్కగా తయారయ్యావు అంటూ కామెంట్లు చేస్తున్నారు.