Nindu Noorella Saavasam Serial Today Episode : ఇంటికి వచ్చిన చిత్రను మనోహరి అనుమానిస్తుంది. నువ్వే కదా నాకు ఫోన్ చేసి బెదిరిస్తుంది అంటూ నిలదీస్తుంది. నిజం చెప్పు లేకపోతే నీ అంతు చూస్తానని బెదిరిస్తుంది. దీంతో చిత్ర ఏం చెప్పాలో అర్థం కాక చూస్తుంటుంది. ఇంతలో మనోహరికి ఫోన్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసిన మనోహరి హలో ఎవరు అని అడగ్గానే ఆటో డ్రైవర్ ప్రతి సారి పరిచయాలు అవసరమా మను అంటాడు. ఆ గొంతు విన్న మనోహరి షాక్ అవుతుంది. చిత్ర అంతకుముందు ఆటో డ్రైవర్‌తో పది వేలు ఇస్తానని మనోహరి తాను చెప్పినట్టు ఫోన్ చేసి మాట్లాడాలని చెప్పింది గుర్తు చేసుకుంటుంది.
ఇంతలో మను నువ్వా..? అని అడుగుతుంది. దీంతో ఆటో డ్రైవర్ అవును నేనే ఏంటి మను నన్ను పట్టుకోవడానికి నీ మొగుణ్ని.. సారీ త్వరలో మాజీ మొగుడు కాబోతున్నాడు కదా వాడిని వాడి వెనక అమర్‌ను పంపించావు. నన్ను కలవాలంటే అందర్ని ఎందుకు పంపించడం.. నేనే డైరెక్టుగా ఇంటికి వచ్చి అందరినీ కలుస్తానని చెప్పాను కదా..? నువ్వు ఇంతగా కలవాలనుకుంటున్నావు కాబట్టి అమర్ వచ్చాక చెబితే నేనే ఇంటికి వచ్చి అందర్ని ఒకేసారి కలుస్తాను అంటాడు. దీంతో మనోహరి కంగారుగా నో నేను నిజంగా అమర్‌ను పంపించలేదు. రణవీర్ ను పంపించింది కూడా నీకోసం కాదు. ఫ్లీజ్ ఈ ఒక్కసారికి వదిలేయ్.. అంటూ ప్రాధేయపడుతుంది.
దీంతో ఆటోడ్రైవర్ చూడు మనోహరి నేను చెప్పినట్టు నువ్వు వింటే.. నువ్వు చెప్పొద్దు అన్న విషయం నేను ఎవ్వరికీ చెప్పను. లేదంటే.. ఇదో ఫోన్ కాల్ అమరేంద్రకు చేస్తాను. డబ్బులు ఎక్కడికి తీసుకురావాలో చెప్తాను. రెడీగా ఉండు అని చెప్పగానే.. మనోహరి సరే అంటూ కాల్ కట్ చేస్తుంది. ఇక చిత్ర కోపంగా ఏంటి మను నేను నీకేదో హెల్ప్ చేద్దామనుకుంటే నన్నే అనుమానిస్తావా..? అంటూ నిలదీస్తుంది. దీంతో మనోహరి ఏదో టెన్షన్‌లో ఉండి అలా అన్నాను ఏమీ అనుకోకు అంటుంది. అయితే సరే నేను వెళ్లి ప్రెష్ అప్ అయి వస్తాను అంటూ వెళ్లబోతుంటే.. మనోహరి మళ్లీ ఎందుకు రావడం అని అడుగుతుంది. అదేంటి మనం వాటర్ వరల్డ్‌కు వెళ్దాం అనుకున్నాం కదా అని చెప్తుంది. నిన్నెవరు పిలిచారు అని మనోహరి అడగ్గానే.. వినోద్ పిలిచారు. నేను రాకపోతే తను కూడా వెళ్లనని చెప్పారు. సరే మను లేట్ అవుతుంది. వెళ్తాను అంటూ వెళ్లిపోతుంది చిత్ర.
తర్వాత అందరూ కలిసి ఎగ్జిబిషన్‌కు వెళ్తారు. మను ఏదో చేయబోతుంది అందుకే ఇంత కంగారు పడుతుంది. అది చేస్తున్న తప్పును ఫాలో అయితే అది నేను క్యాష్‌గా మార్చుకోవచ్చు.. అయినా నా పిచ్చి కానీ ఇక్కడ కోట్లు పక్కన పెట్టుకుని లక్షల కోసం కక్కుర్తి పడుతున్నానేంటి అని చిత్ర మనసులో అనుకుంటుంది. అందరూ లోపలికి వెళ్లిపోయాక మనోహరి పక్కకు వెళ్లి రణవీర్‌కు కాల్ చేస్తుంది. రణవీర్ కాల్ లిఫ్ట్ చేసి చెప్పు మనోహరి అని అడుగుతాడు. ఏంటి చెప్పేది అంజలిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడానికి వాటర్ పార్క్‌కు రమ్మని చెప్పాను కదా అంటుంది. ఆల్ రెడీ వచ్చేశాను. మీరు రావడమే ఆలస్యం అని రణవీర్ చెప్తాడు. అవునా ఎక్కడున్నావు అని అడుగుతుంది. సరే నేను కిడ్స్ ప్లేయర్ దగ్గర ఉన్నాను. మీరు ఎక్కడున్నారో చెబితే నా పని పూర్తి చేసుకుని వెళ్లిపోతానున అని చెప్తాడు. సరే మేము లోపలికి వస్తున్నాము.. నువ్వ అమర్ కంట పడకుండా జాగ్రత్త పడు అని చెప్తుంది. సరే అంటూ కాల్ కట్ చేస్తాడు రణవీర్.
తర్వాత అందరూ ఎగ్జిబిషన్‌లో ఎంజాయ్ చేస్తుంటారు. పిల్లుల అందరూ ఆడుకుంటూ వెళ్లి రణవీర్‌ను చూస్తారు. రణవీర్ పిలిచి దగ్గరుకు వెళ్తుంటారు. రణవీర్ పిల్లలను చూసి షాక్ అవుతాడు. పిల్లలు దగ్గరకు వెళ్లగానే.. హాయ్ అంజు ఎలా ఉన్నావు అని పలకరిస్తాడు. అంకుల్ నేను బాగానే ఉన్నాను మీరెలా ఉన్నారు అని అడుగుతుంది. ఇంతో అమ్ము కూడా మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి అని అడుగుతుంది. ఇంతలో అమర్ వచ్చి రమ్మని అడిగితే కుదరదు అని చెప్పావు.. అంటాడు. వచ్చిన పని అయిపోయింది అమరేంద్ర గారు.. అందుకే ఒకసారి మీ అందరినీ కలిసి వెళ్దామని వచ్చాను. పైగా అంజలిని కూడా చూసినట్టు ఉంటుంది కదా అని చెప్తాడు రణవీర్.
దీంతో అంజలి సరే అంకుల్ మనం వెళ్లి ఎంజాయ్ చేద్దాం పదండి అంటుంది. అందరూ కలిసి వెళ్లిపోతారు. మనోహరి టెన్షన్ పడుతుంది. చిత్ర వచ్చి ఏంటి మను అనుకుని కలిశారా..? అనుకోకుండా కలిశారా? అని అడుగుతుంది. జస్ట్ ఇన్మఫర్మేషన్ కోసం అడిగానే అంతే చెప్పడం ఇష్టం లేకపోతే వెళ్దాం పద అని ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోతారు. మనోహరి తర్వాత రణవీర్‌ను పక్కకు తీసుకెళ్లి రణవీర్ ఇప్పుడు అంజలిని ఎలా కిడ్నాప్ చేస్తావు. అది కుదరని పని కానీ ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుంచి వెళ్లిపో.. అని చెప్తుంది. దీంతో రణవీర్ ఏమీ అవసరం లేదు. అటు చూడు.. అని తన మనుషులను చూసిప్తాడు. ఆ రౌడీలు అంజును కిడ్నాప్ చేయబోతుంటారు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?