Harish Rao: బీజేపీ పేదల పక్షాన, రైతుల పక్షాన, దళితుల పక్షాన ఉండదని.. కేవలం ఉత్తర భారతదేశ పక్షాన మాత్రమే ఉంటుందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అంటే బీజేపీకి ఎందుకంత చిన్నచూపు అని ప్రశ్నించారు. గోదావరి పుష్కరాలకు తెలంగాణకు గుండు సున్నా అయితే.. ఆంధ్రప్రదేశ్ కు 100 కోట్లు ప్రకటించారని అని ఫైరయ్యారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలంలో నిర్వహించిన కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
‘వడ్ల కంటే గోధుమలకు మద్దతు ధర ఎక్కువ ఉంది. నార్త్ ఇండియాలో పండే గోధుమకుండే విలువ తెలంగాణలో పండే వరికి లేదా..? బీజేపీకి ఓటు వేసినందుకు ఒక్కొక్క రైతు ఎకరానికి రూ.7వేలు నష్టపోయారు. పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఉండి ఉంటే కేంద్రం మెడలు మంచి తెలంగాణకు నిధులు తెచ్చేవాళ్లం. ఉద్యమకారుడు తానాజీ బీజేపీకి వెళ్లి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరినందుకు వారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. వారితోపాటు చేరిన 150 మంది మాజీ సర్పంచులు, ఎంపీటీసీలకు బీఆర్ఎస్ తరపున స్వాగతం పలుకుతున్నాం. రాష్ట్ర ప్రజలకు స్పష్టత వచ్చేసింది. మల్లొచ్చే ప్రభుత్వం ఏదని ఎవరిని అడిగినా బీఆర్ఎస్ పక్కా అని అంటున్నారు. రెండేళ్లు గడిచిపోయింది. ఉన్నది ఇంకా రెండేళ్లు. మనమందరం కలిసికట్టుగా పనిచేస్తే మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎగిరేది బీఆర్ఎస్ జెండానే’ అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.
బీజేపీ దేశం కోసం ధర్మం కోసం అంటూ డైలాగులు కొట్టింది. ప్రధాని మోదీ సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటారు. కానీ వాస్తవంగా జరిగింది ఏంటి అంటే సబ్కా వికాస్ కాదు ఓ పూరా బక్వాసే. బీజేపీ పేద ప్రజల, రైతుల పక్షాన ఉండదు. దళితుల పక్షాన ఉండదు. కేవలం నార్త్ ఇండియా వైపే ఉంటుంది. తెలంగాణ దేశంలో లేదా? ఎందుకు తెలంగాణకు నిధులు ఇవ్వరు అని అడుగుతున్నాను. ఎందుకు బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణకు శ్రీరామరక్ష అంటే.. జాతీయ పార్టీలు తెలంగాణకు అన్ని విధాల అన్యాయాలే చేస్తాయి. నిజాంబాద్ జిల్లా కందకుర్తి దగ్గర గోదావరి నది తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. తెలంగాణ గుండా ప్రవహించి ఆంధ్రాలో కలుస్తుంది. 2027 గోదావరి పుష్కరాలకు ఇదే బిజెపి ఆంధ్రకు 100 కోట్లు ఇచ్చింది. 8 ఎంపీలను గెలిపించిన తెలంగాణకు గుండు సున్నా ఇచ్చింది. తెలంగాణలో గోదావరి నది లేదా? ఎందుకు గోదావరి పుష్కరాలకు నిధులు ఇవ్వడం లేదు’ అని హరీష్ రావు నిలదీశారు.
ALSO READ: BEL Notification: బెల్ నుంచి భారీ నోటిఫికేషన్.. జీతం అక్షరాల రూ.40వేలు, దరఖాస్తుకు 2 రోజులే గడువు
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ గెలిచింది కాబట్టి, ప్రాంతీయ పార్టీ కాబట్టి ఢిల్లీ మెడలు వంచింది. అదే తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచి ఉంటే ఢిల్లీలో బీజేపీ మెడలు వంచి నిధులు తీసుకొని వచ్చేది. 157 మెడికల్ కాలేజీలను కేంద్రం ప్రకటిస్తే ఒక్క మెడికల్ కాలేజ్ తెలంగాణకు ఇవ్వలేదు. నిజాంబాద్ జిల్లా తెలంగాణలో అన్నపూర్ణ. అత్యధిక వరి పండించే రాష్ట్రం తెలంగాణ. 10 ఏళ్లలో కేసీఆర్ నాయకత్వంలో దేశానికే ధాన్యాగారంగా తెలంగాణ ఎదిగింది. ఒకప్పుడు పక్క రాష్ట్రాల నుంచి బియ్యం తెచ్చుకునే పరిస్థితి ఉండే తెలంగాణలో. ఇప్పుడు సగం దేశానికి తెలంగాణ అన్నం పెడుతున్నది’ అని అన్నారు.
కేసీఆర్ 24 గంటల కరెంటు ఇచ్చారు. రైతుబంధు పథకం తెచ్చారు. మిషన్ కాకతీయలో చెరువులు బాగు చేశారు. ఈరోజు ప్రాజెక్టులు కట్టింది కేసీఆర్. పెండింగ్ ప్రాజెక్ట్ లు అన్ని పూర్తి చేసింది కేసీఆర్. పండించిన ప్రతి గింజను కొన్నది కేసీఆర్. 8 మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు బీజేపీ అధిష్టానానికి ఎదురు మాట్లాడే దమ్ముందా..? అదే బీఆర్ఎస్ ఉంటే మన హక్కుగా వచ్చే నిధులను తెలంగాణకు తెచ్చేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చినప్పుడు తెలంగాణకు ఎందుకు ఇవ్వరు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు గుండు సున్నా. మెడికల్ కాలేజీలు గుండు సున్నా. నవోదయ విద్యాలయాలు గుండు సున్న. చివరికి వడ్లకు మద్దతు ధర ఇయ్యమంటే మొండి చెయ్యి. బీజెపికి ఓటేసినందుకు ఒక్కొక్క రైతు ఎకరానికి 7000 రూపాయలు నష్టపోతున్నారు’ అని హరీష్ రావు తెలిపారు.