Bigg Boss Telugu 9 Latest Promo: ఈ రోజు సండే.. అంటే బిగ్ బాస్ హౌజ్లో ఫన్ డే. కంటెస్టెంట్స్ హోస్ట్ నాగార్జున ఆటపాట మామూలుగా ఉండదు. అసలు బిగ్ బాస్ షోలో అత్యంత ఆసక్తికరమైన ఘట్టమంటే వీకెండ్ ఎపిసోడ్స్. వీకెండ్ వచ్చిందంటే నాగ్.. కంటెస్టెంట్స్ తప్పొప్పులు ఎంచుతూ కడిగిపారేస్తాడు. అలాగే వారితో సరదగా ఆటలు ఆడిస్తూ.. పాటలు పాడిస్తుంటారు. ఆటపాట మధ్యలో నామినేషన్లో ఉన్నవారి సేవ్ చేస్తూ ఝలక్ ఇస్తుంటాడు. ఎప్పటిలాగే ఈ సండే ఫన్ డే అంటూ హోస్ట్ నాగార్జున వచ్చేసారు. కంటెస్టెంట్స్ తో సరదగా ఆటలు ఆడిస్తూ.. టాస్క్లు ఇచ్చారు. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుంది. ఇప్పటికే మూడు వారాలు పూర్తి చేసుకున్న ఈ సీజన్.. నేటితో నాలుగో వారం కూడా పూర్తి చేసుకోబోతోంది.
నాలుగో వారం ఎలిమినేషన్లో భాగంగా మాస్క్ మ్యాన్ హరీష్ ఎలిమినేట్ కాబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. మరికొన్ని గంటల్లో టీవీల్లోకి సన్ ఫన్డే ఎపిసోడ్ టెలికాస్ట్ కాబోతుంది. ఈ క్రమంలో నేటి ఎపిసోడ్కి సంబంధించిన వరుస ప్రొమోలు విడుదల చేస్తూ ఆసక్తి పెంచుతోంది బిగ్ బాస్. ఇందులో భాగంగా నేటి మూడో ప్రొమో విడుదల చేశారు. ముందు ప్రొమోలో ఇమ్మాన్యుయేల్ నడుము గిల్లిందో ఎవరో నాగార్జున బయటపెట్టించారు. తనూజ ఇమ్మాన్యుయేల్ నడుము గిల్లినట్టు చూపించాడు. స్వయంగా తనూజ తన తప్పు ఒప్పుకుంటే నిజం బయటపెట్టిన ఈ ప్రొమో చాలా సరదగా.. ఫన్నీగా సాగింది. ఇక తాజాగా విడుదలైన మూడో ప్రొమోలో కేవలం మగవాళ్లకు మాత్రమే పరీక్ష పెట్టాడు నాగార్జున.
Also Read: Srija Dammu Father: నేను ఇంటింటికి వెళ్లి చెత్త తీస్తా.. శ్రీజ దమ్ము ట్రోల్స్పై తండ్రి ఎమోషనల్
ఈ టాస్క్ లో భాగంగా మగవాళ్లకు కనిపెట్టండి చూద్దాం అంటూ.. హీరోహీరోయిన్ల కళ్లు చూపించారు. ఆ కళ్లు చూసి ఆ నటీనటులెవరో కనిపెట్టాలి. ఇందులో ఓడిన వారి డ్రెస్ లోపల ఐస్ క్యూబ్స్ వేయాల్సి ఉంటుంది. ఈ ప్రొమో ప్రకారం.. ఈ గేమ్ ఆడేందుకు ముందుగా ఓనర్స్ టీం నుంచి భరణి, టెనెంట్స్ టీం నుంచి హరీష్లు వచ్చారు. వారికి ఓ హీరోయిన్ కళ్లు చూపించి ఎవరో చెప్పాలని పరీక్ష పెట్టారు. అది చూసి గంట కొట్టిన భరణి.. ఆ కళ్లు ఎవరివో కనిపెట్టడంలో ఫెయిల్ అయ్యాడు. రష్మిక కళ్లకు బదులుగా త్రిష అని చెప్పి తప్పులో కాలేశాడు. దీంతో అతడి షర్టులో ఐస్ క్యూబ్స్ పడ్డాయి.
ఆ తర్వాత సోల్జర్ పవన్ కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్లు వచ్చారు. వారికి మరో విజువల్స్ చూపించారు. అవి చూసిన పవన్.. ఆ నటుడు కళ్లు ఎవరివో కరెక్ట్గా సమాధానం చెప్పాడు. అవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌వి అంటూ ఫ్యానిజం చూపించాడు. కళ్యాణ్తో పాటు ఇమ్మాన్యుయేల్ కూడా ఈ గేమ్లో పాల్గొన్నాడు. మొదట సమాధానం చెప్పకపోవడంతో అతడు పన్మెంట్ తీసుకున్నాడు. అదే సమయంలో ఓనర్స్ టీం అయినా ఇమ్మాన్యుయేల్కి.. వెనక నుంచి రీతూ చౌదరి కౌంటర్ ఇచ్చిన తీరు ఆకట్టుకుంది. మా వాడికి మేము ఐస్ వేయొచ్చా సర్ అంటూ సమాధానం చెప్పకపోవడంతో సటైర్ విసిరింది.
ఆ తర్వాత గేమ్ ఆడేందుకు ఓనర్స్ నుంచి సుమన్ శెట్టి, టెనెంట్స్ నుంచి డిమోన్ పవన్ వచ్చాడు. వీరికి చూపించిన కళ్లు చూసి టక్కున గుర్తుపట్టిన పవన్ ముందుగా గంట కొట్టాడు. ఆ కళ్లు మహేష్ బాబువి అని కనిపెట్టి గెలిచాడు. ఈసారి కూడా ఓనర్స్ టీం ఓడటంతో సుమన్ శెట్టికి షర్టులో ఐస్ పడింది. ఆ తర్వాత నామినేషన్లో ఉన్నవారి సేవ్ చేసేందుకు.. వారి వారికి ప్రాపర్టీస్ ఇచ్చారు. ఇందులో భాగంగా పోపుల డబ్బా ఇచ్చారు. అందులో గిన్నెలకు రెడ్ కలర్ వచ్చిన వాళ్లు అన్ సేఫ్, గ్రీన్ వచ్చినవారు సేఫ్. హరీష్, దివ్యలు ఇద్దరికి రెడ్ రావడంతో వారిద్దరు అన్‌సేవ్ అయ్యారు. దీంతో ప్రొమో ముగిసింది. మరి ఈ వారం సేవ్ అయ్యి హౌజ్లో ఉన్నది ఎవరూ, ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లిందో ఎవరో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.