Tribanadhari Barbarik OTT: ఇటీవల కాలంలో ఒక సినిమా థియేటర్లో విడుదల అయింది అంటే నెల రోజులు కాకుండానే ఆ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా నెలరోజుల వ్యవధిలోనే సినిమాలు ఓటీటీలోకి వస్తున్న నేపథ్యంలో చాలామంది థియేటర్ కు వెళ్లి సినిమా చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. ఇక ప్రతిరోజు నిత్యం ఎన్నో సినిమాలు ఓటీటీలో ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. తాజాగా ఉదయభాను (Udayabhanu) ప్రధాన పాత్రలో నటించిన ” త్రిబాణధారి బార్బరిక్”(Tribanadhari Barbarik) సినిమా కూడా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది.
డైరెక్టర్ మోహన్ శ్రీ వాత్సవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ ఆగస్టు 29వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా థియేటర్లలో ఎన్నో అంచనాలు నడుమ విడుదల అయినప్పటికీ పెద్దగా ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయింది. ఇక ఈ సినిమాకు ఆదరణ లేని నేపథ్యంలో డైరెక్టర్ శ్రీ వాత్సవ చెప్పుతో తనని తాను కొట్టుకుంటూ షేర్ చేసిన ఒక వీడియో కూడా సంచలనగా మారిన సంగతి తెలిసిందే. ఇలా ఎన్నో అంచనాలు నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
ఆగస్టు 29వ తేదీ ఈ సినిమా థియేటర్లలో విడుదలవడంతో త్వరలోనే డిజిటల్ స్ట్రీమింగ్ కి కూడా సిద్ధమవుతోంది ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్స్ట్(Sun Next) సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా అక్టోబర్ 10వ తేదీ నుంచి తెలుగు తమిళ భాషలలో అందుబాటులోకి రాబోతున్నట్లు తాజాగా సన్ నెక్స్ట్ అధికారికంగా వెల్లడించారు. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని ప్రకటిస్తూ.. “ప్రేమ నష్టం విడదీయలేని బంధం.. తన మనవరాలిని కనుగొనేందుకు ఓ మానసిక వైద్యుడు చేసే పోరాటం” అనే క్యాప్షన్ తో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు. ఈ సినిమాని థియేటర్లలో చూడటం మిస్ అయిన వారు అక్టోబర్ 10 వ తేదీ నుంచి సన్ నెక్స్ట్ లో చూడవచ్చు.
ఇక ఈ సినిమాలో ప్రముఖ సీనియర్ నటుడు సత్యరాజ్(Satya Raj) కీలక పాత్రలో నటించారు. ఉదయభాను, వశిష్ట ఎన్ సింహ ప్రధాన పాత్రలలో సందడి చేశారు. ఇక ఈ సినిమాలో సత్యం, రాజేష్, క్రాంతి వంటి పలువురు నటీనటులు భాగం అయ్యారు. ఈ సినిమాకు శ్రీ వాత్సవ దర్శకత్వం వహించగా ఈ చిత్రాన్ని మారుతి సమర్పణలో వానర సెల్యులాయిడ్ బ్యానర్ పై విజయ్ పాల్ రెడ్డి నిర్మించారు. ఇక చాలా సంవత్సరాల తర్వాత సీనియర్ నటి, యాంకర్ ఉదయభాను ఈ సినిమాలో కనిపిస్తున్న నేపథ్యంలో సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమా మరోసారి ఉదయభానుకు తీవ్ర నిరాశ మిగిల్చిందని చెప్పాలి. మరి థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఓటీటీలో అయిన ప్రేక్షకాదరణ పొందుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Also Read: Rukmini Vasanth: క్రష్ ట్యాగ్ పై రుక్మిణి షాకింగ్ రియాక్షన్.. తాత్కాలికం అంటూ!