Krishnamachari Srikkanth: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఈనెల 19వ తేదీ నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ కెప్టెన్సీ తొలగించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి గిల్ కు కెప్టెన్సీ అప్పగించింది. ఈ నిర్ణయం పై తీవ్రస్థాయిలో దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా కూడా దారుణమైన ట్రోలింగుకు గురవుతున్నాడు. అలాంటి ప్లేయర్లను జట్టులోకి తీసుకుంటే వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంట్ గెలవడం టీమిండియా మర్చిపోవాల్సిందేనని మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ (Krishnamachari Srikkanth). దీంతో మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
Also Read: Abhishek Sharma Sister Wedding: ఇండియా కోసం త్యాగం…వీడియో కాల్ లో సోదరి పెళ్లి చూసిన అభిషేక్ శర్మ
ఆస్ట్రేలియాతో జరిగే వన్డే అలాగే టీ20 ఫార్మాట్ సిరీస్ ల కోసం ప్రకటించిన టీమిండియా జట్టు సభ్యుల సెలక్షన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకతను బీసీసీఐ మూటగట్టుకుంది. ఇప్పుడు హర్షిత్ రాణా లాంటి ప్లేయర్ ను సెలెక్ట్ చేయడంపై కూడా విమర్శలు ఎదుర్కొంటోంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియాతో జరిగే టి20 అలాగే వన్డేలకు హర్షిత్ రాణాను సెలెక్ట్ చేయడం అత్యంత దారుణం అంటూ మండిపడ్డారు. ఇలాంటి ప్లేయర్లను ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారని నిలదీశాడు.
హర్షిత్ రాణా టీం ఇండియాలో పర్మనెంట్ ప్లేయర్ అయిపోయాడని చురకలు వంటించారు కృష్ణమాచారి శ్రీకాంత్. ఎందుకంటే హర్షిత్ రాణా అంటే, గంభీర్ కు చాలా ఇష్టమైన ప్లేయర్ అంటూ సెటైర్లు పేల్చారు. గౌతమ్ గంభీర్ కు నచ్చితే ఎలాంటి ప్లేయర్ అయినా జట్టులో ఉంటాడని చెప్పకనే చెప్పారు. గిల్ తర్వాత కచ్చితంగా హర్షిత రాణా టీమిండియాలో ఉంటాడని వెల్లడించారు. ఇక జట్టు సెలక్షన్ ఇలాగే కొనసాగితే భవిష్యత్తు కష్టమైనా అని హెచ్చరించారు. 2027 వన్డే వరల్డ్ కప్ కోసం టీం ఇండియా జట్టును ఇప్పటి నుంచి తయారు చేసుకోవాలి. హర్షిత్ రాణా అలాగే నితీష్ కుమార్ లాంటి ప్లేయర్లు జట్టులో ఉంటే ట్రోఫీకి గుడ్ బై చెప్పాల్సిందేనని సెటైర్లు పేల్చారు కృష్ణమాచారి శ్రీకాంత్. దీంతో కృష్ణమాచారి శ్రీకాంత్ చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.
హర్షిత్ రాణా స్థానంలో మహమ్మద్ సిరాజ్ ను సెలక్ట్ చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అన్ని ఫార్మెట్స్ లో బుమ్రా కంటే అద్భుతంగా సిరాజ్ ఆడతాడని అంటున్నారు క్రీడా విశ్లేషకులు.
Legendary Cricketer Krishnamachari Srikkanth Explains How HARSHIT RANA Gets His Spot In All Format. 😂😂#BCCI #RohitSharma𓃵 #ViratKohli𓃵 #IndianCricket pic.twitter.com/Vh6BWIC140
— surendeRR singh 💗 (@Surende26790545) October 5, 2025