BigTV English

Grokipedia: రెండు వారాల్లో గ్రోకీపీడియా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన

Grokipedia: రెండు వారాల్లో గ్రోకీపీడియా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన

Grokipedia: టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ మరో సంచలన ప్రకటన చేశారు. వికీపీడియా తరహాలో.. గ్రోకీపీడియా ప్రారంభించనున్నట్లు ఎక్స్ లో ప్రకటించారు. గ్రోకీపీడియా(Grokipedia) 0.1 బీటా వెర్షన్‌ మరో రెండు వారాల్లో అందుబాటులో తీసుకోస్తామని తెలిపారు.


గ్రోకీపీడియాను మస్క్‌కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఎక్స్‌ఏఐ రూపొందిస్తుంది. ఎక్స్ లో ఓ యూజర్ చేసిన పోస్టుపై స్పందిస్తూ.. మనుషులకు, ఏఐకు ప్రపంచంలోనే అత్యంత కచ్చితమైన నాలెడ్జ్‌ సోర్స్‌ గ్రోకీపీడియా అన్నారు. ఈ ఫీచర్లను అధికారికంగా ప్రకటించలేదు మస్క్. అయితే వాస్తవాలను తెలిపేందుకు మాత్రమే ఈ ప్లాట్‌ఫామ్‌ అన్నారు. సెప్టెంబర్‌ లో కూడా మస్క్‌ గ్రోకీపీడియా ప్రస్తావన తెచ్చారు. గ్రోకీపీడియాలను ఎక్స్‌ యాప్‌తోనే అనుసంధానించే అవకాశం ఉంది.

గ్రోకీపీడియా ఫీచర్లు ఇలా ఉండే అవకాశం

ఎక్స్ లో ఓ యూజర్ గ్రోకీపీడియా ఫీచర్లను గురించి ప్రస్తావించారు. ‘మానవులకు, AI కి ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత కచ్చితమైన సమాచారం అందిస్తుంది ఎలాంటి పరిమితులు లేకుండా అని ట్వీట్ చేశా రు. వికీపీడియాలో ఉండే సగం సత్యాలను గుర్తించడానికి, వాస్తవాలను తెలిజేసేందుకు ఈ ప్లాట్ ఫామ్ ఉపయోగపడుతుంది. దీనిని గ్రోక్ AI చాట్‌బాట్‌ తో రూపొదిస్తున్నారు’ అని ఎక్స్ యూజర్ పోస్టు పెట్టారు. అయితే ఈ ఫీచర్లను మస్క్ లేదా xAI అధికారికంగా ధృవీకరించలేదు.


నాలెడ్జ్ ప్లాట్‌ఫామ్ వికీపీడియాకు xAI ఆధారంగా గ్రోకిపీడియా అభివృద్ధి చేస్తున్నామని, దీని బీటా వెర్షన్ రెండు వారాల్లో అందుబాటులోకి వస్తుందని ఎలాన్ మస్క్ ఎక్స్ పోస్టు పెట్టారు. వికీపీడియా వంటి వాటిని గ్రోకీపీడియా విశ్లేషిస్తుంది. అబద్ధాలను ఫ్లాగ్ చేస్తుంది, సగం సత్యాలను సరిదిద్దుతుంది. దీని ఎంట్రీలలో మార్పును గుర్తిస్తుందని మరో యూజర్ పోస్టు చేశారు.

వికీపీడియాపై విమర్శలు

వికీపీడియా వచ్చే నిధులు, సంపాదకీయ విధానంపై ఎలాన్ మస్క్ నిత్యం విమర్శలు చేస్తుంటారు. వికీపీడియాలో వాస్తవాలను తెలుసుకునేందుకు ఏఐతో నావిగేట్ చేయాలని మస్క్ అభిప్రాయపడుతుంటారు. మస్క్ నిర్ణయంపై కొంతమంది మద్దతు తెలపగా, మరికొందరు గ్రోక్ డేటా కొత్త వివాదాలకు దారితీయొచ్చని హెచ్చరిస్తున్నారు.

మస్క్ గతంలో వికీపీడియాపై విమర్శలు చేశారు. లాభాపేక్షలేని సంస్థకు నిధులు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. వికీపీడియా కంటెంట్ పక్షపాతంగా ఉంటుందని ఆరోపించారు. ఇందులోని సమాచారం కాలక్రమేణా ప్రజలను తప్పుదారి పట్టిస్తుందన్నారు. గ్రోకీపీడియా వికీపీడియా కంటే మెరుగైందని చెప్పుకొచ్చారు.

Also Read: Putin Vs Trump: ట్రంప్‌పై పుతిన్ ఆగ్రహం.. భారత్‌ తలొగ్గదు, అమెరికాకు పెద్ద దెబ్బ

అక్టోబర్ 2న ఎలాన్ మస్క్ 500 బిలియన్ డాలర్ల నికర ఆదాయంతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడి స్థానంలో నిలిచారు. మస్క్ తర్వాత ఒరాకిల్ లారీ ఎల్లిసన్ రెండో స్థానంలో నిలిచాడు. మస్క్ AI స్టార్టప్ xAI విలువ 75 బిలియన్ డాలర్లు. xAI 200 బిలియన్ల డాలర్ల మార్కెట్ విలువను లక్ష్యంగా పెట్టుకుంది.

Related News

Singapore News: ఇద్దరు భారతీయ టూరిస్టులకు సింగపూర్ కోర్టు షాక్.. హోటల్ గదుల్లో వారిని పిలిచి

Theaters Attack: కెనడాలో ఘోరం.. భారతీయ చిత్రాల థియేటర్లపై దాడులు, పవన్ సినిమాకు

Putin Vs Trump: ట్రంప్‌పై పుతిన్ ఆగ్రహం.. భారత్‌ తలొగ్గదు, అమెరికాకు పెద్ద దెబ్బ

Pakistan: ఆయనో సేల్స్ మెన్, ఈయనో మేనేజర్.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ప్రధానిపై సెటైర్లు

America News: ఎయిర్‌పోర్టులో ఢీ కొన్న విమానాలు, ఎలా జరిగింది? వైరల్ అవుతున్న వీడియో

Philippines: చిగురుటాకులా వణికిన ఫిలిప్పీన్స్‌.. వరుసగా మూడు భూకంపాలు, 22 మంది మృతి

USA: అమెరికాలో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా..

Big Stories

×