IND VS PAK Toss: మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ( ICC Womens World Cup 2025 ) నేపథ్యంలో.. టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఇవాళ మ్యాచ్ జరుగుతోంది. కొలంబో ( R.Premadasa Stadium, Colombo ) వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ మధ్యాహ్నం మూడు గంటలకే ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ సమయంలో గందరగోళం నెలకొంది. టీమిండియా టాస్ గెలిచినప్పటికీ… పాకిస్తాన్ గెలిచినట్లు అక్కడ ఉన్న రిఫరీ తేల్చేశారు. దీంతో ఈ టాస్ ప్రక్రియ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. రిఫరీతో పాకిస్తాన్ ఫిక్సింగ్ చేస్తుందని.. టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఐసీసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ ( India Women vs Pakistan Women ) మధ్య మ్యాచ్ ఇప్పటికే ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్ టాస్ వేసే సమయంలో ఓ గందరగోళ పరిస్థితి నెలకొంది. టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ( Harmanpreet Kaur ) కాయిన్ ( Coin ) తీసుకొని గాల్లోకి ఎగరవేశారు. అయితే ఆ సందర్భంగా పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా ( Fatima Sana) టెయిల్స్ ( Tails) అంటూ పేర్కొన్నారు. అయితే ఆ కాయిన్ మాత్రం హెడ్ ( Head) పడింది. ఇదే విషయాన్ని అక్కడ ఉన్న రిఫరీ గుర్తించారు.
అయితే, పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనానే హెడ్ చెప్పిందని అనుకోని, పాకిస్తాన్ టాస్ గెలిచినట్లు రిఫరీ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ కెప్టెన్ సనా బౌలింగ్ ఎంచుకున్నారు. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. రిఫరీ తప్పిదం కారణంగా ఈ గందరగోళం నెలకొంది. రిఫరీ సరిగ్గా వినకపోవడంతో పాకిస్తాన్ టాస్ గెలిచినట్లు అయింది. అయితే దీనిపై టీమిండియా అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టాస్ విషయంలో రిఫరీతో పాకిస్తాన్ ఫిక్సింగ్ చేసిందని మండిపడుతున్నారు. ఇక అటు ఇంత జరుగుతున్నా టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ( Harmanpreet Kaur ) సింపుల్ గా నవ్వుతూ వెళ్ళిపోయారు.
ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా… తడబడుతూనే ఉంది. ఇప్పటివరకు మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా 113 పరుగులు మాత్రమే చేసింది. ఇప్పటివరకు 26 ఓవర్లు పూర్తయ్యాయి. ఇందులో ప్రతికా 31 పరుగులు చేయగా స్మృతి మందాన 23 పరుగులకు అవుట్ అయ్యారు. టీమిడియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 19 పరుగులు చేసి కాసాపేట క్రితమే వికెట్ సమర్పించుకున్నారు. ప్రస్తుతం హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్ బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో కనీసం 250 పరుగులకే పైగా టార్గెట్ పెడితేనే గెలిచే ఛాన్సులు ఉంటాయి.
Also Read: Abhishek Sharma Sister Wedding: ఇండియా కోసం త్యాగం…వీడియో కాల్ లో సోదరి పెళ్లి చూసిన అభిషేక్ శర్మ
Toss happens for #indvpak match –
Harmanpreet toss the coin
Pak Captain – Tails
Match Referee – Heads is the call… And It’s heads.
Seriously Dumbo?#INDvsPAK
— Abhishek (@extraa2AB) October 5, 2025