Dammu Srija Father Comments: ‘పిట్ట కొంచం.. కూత గనం‘.. బిగ్బాస్ 9 తెలుగు కంటెస్టెంట్ శ్రీజని చూసి అంత అంటున్న మాట ఇది. కామనర్లో బిగ్ బాస్‌కు వచ్చిన శ్రీజ.. తనదైన ఆటతో హౌజ్ లో దుమ్మురేపుతుంది. వైజాగ్ చెందిన శ్రీజ కామనర్ నుంచి బిగ్ బాస్‌కు సెలక్ట్ అయ్యింది. అగ్నీ పరీక్షలో దుమ్మురేపే ఆటతో జడ్జస్ని సైతం సర్ప్రైజ్ చేసింది. అగ్ని పరీక్ష ఎలాంటి కష్టమైన టాస్క్ అయినా.. ఈజీ ఆడి గెలిచింది. ఎంతో ఎనర్జితో అన్ని టాస్క్ల్లో పాల్గొని అందరి చేత ప్రశంసలు అందుకుంది. అగ్రిపరీక్ష కార్యక్రమంలో ఎంతోమంది అభిమానాన్ని అందుకున్న శ్రీజ.. హౌజ్ వెళ్లాక తీవ్ర నెగిటివిటీ ముటగట్టుకుంది.
చిన్న చిన్న విషయానికి వాగ్వాదాలకు దిగడం.. అనవసరమైన విషయాలపై కూడా ఎక్కువగా రియాక్ట్ అవుతుంది. సంధు దొరికితే చాలు.. వాదనకు దిగుతుంది. ప్రతి విషయంలోనూ నోరుపారేసుకుంటుండంతో ఆమెకు నెగిటివిటీ పెరుగుతుంది. ఆఖరికి హోస్ట్ నాగార్జున సైతం తుత్తూ..తుత్తూ.. తుత్తూ అంటూ ప్రతి దాంట్లో దూరిపోతావంటూ ఆమెపై అసహనం చూపించాడు. ప్రియ ఎలిమినేషన్ ముందు వరకు హౌజ్ లో రెచ్చిపోయినా శ్రీజ.. ఈ మధ్య కాస్తా సైలెంట్ అయ్యింది. ఆడియన్స్ ఓటింగ్‌తో తనని తాను తగ్గించుకుని ఆటపై ఫోకస్ పెట్టింది. అయితే కొన్ని రోజులగా శ్రీజపై విపరీతమైన ట్రోల్స్ వస్తున్న సంగతి తెలివసిందే. ముఖ్యంగా ఆమె చెత్త కవర్లు పట్టుకుని హౌజ్ లో కనిపించిన వీడియో, ఫుటేజ్తో ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
చెత్త చెత్త అంటూ శ్రీజ దమ్ము పిలుస్తూ వీడియో లు, ఫోటోలు షేర్ చేస్తున్నారు. అయితే తాజాగా తన కూతురిపై వస్తున్న ట్రోల్స్పై ఆమె తండ్రి స్పందించారు. తాజాగా ప్రముఖ యూట్యూబ్ ఛానల్‌కు ఆయన ఇంటర్య్వూ ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. “సాధారణంగా నన్ను దమ్ము శ్రీనివాస్ అని పిలుస్తారు. కానీ ఇప్పుడు శ్రీజ దమ్ము తండ్రి అంటున్నారు. వైజాగ్ అమ్మాయి బిగ్ బాస్కి వెళ్లిందంటూ నన్ను పిలిచి సన్మానం చేశారు. నా కూతురికి అనుకున్నది సాధించింది. బిగ్ బాస్ ఆఫర్ వచ్చిన విషయం చెప్పలేదు. అగ్ని పరీక్షకు సెలక్ట్ అయ్యి వెళ్లడానికి ముందు రోజు మాకు చెప్పింది. మేము తనకి అడ్డు చెప్పలేదు. ముందు నుంచి తన అభిప్రాయాన్ని, నిర్ణయాన్ని గౌరవిస్తాం. బిగ్ బాస్ ఆఫర్ రావడంతో ఆఫీసులో పర్మిషన్ అడిగింది. కానీ, వాళ్లు ఒప్పుకోలేదు.
నెల రోజులు ముందు చెప్పాలని నిబంధనలు పెట్టారు. దీంతో రూ. 2 లక్షల ఉద్యోగం వదిలి బిగ్ బాస్కి వెళ్లింది. ఈ విషయంలో మేము తనకేలాంటి నిబంధనలు పెట్టలేదు. తన ఇష్టమని చెప్పాం” అని ఆయన అన్నారు. ఇక హౌజ్ చెత్త చెత్త అంటూ వస్తున్న ట్రోల్స్ పై ఆయన స్పందించారు. “నిజానికి ఆ ట్రోల్స్ తనని ఉద్దేశించి చేస్తున్నవి కాదు. నన్ను ఉద్దేశించి తనపై ట్రోల్ చేస్తున్నారు. నేను పారిశుద్ధ కార్మికుడిని. బాధ్యత కలిగిన పబ్లిక్ హెల్త్ వర్కర్ని. చెత్త తీసుకువెళ్లడమనేది చిన్న విషయం కాదు. నా ప్రొఫెషన్ పెట్టి తనని కామెంట్స్ చేస్తున్నారు. చెత్త.. చెత్త.. చెత్త అంటూ కామెంట్స్ చేస్తుంటే చాలా బాధగా ఉంది. పారిశుద్ధ కార్మికుడు అంటే చులకనా?” ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.