Kadapa News: రోజు రోజుకీ సమాజంలో దారుణ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆస్తుల కోసం సొంత చెల్లి, అన్న, తల్లిదండ్రులు అని చూడకుండా కిరాతకంగా చంపుకుంటున్నారు. దేశంలో ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉన్నాయి. కొందరు సైకోగాళ్లు ఆస్తి కోసం సొంత తల్లిదండ్రులను చంపేందుకు కూడా వెనుకాడడం లేదు. తాజాగా పేరెంట్స్ డబ్బులు ఇవ్వలేదని కక్ష పెట్టుకుని సొంత తల్లిని కిరాతకంగా చంపిన ఘటన వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది. కన్న తల్లిని దారుణంగా గొంతు కోసి ఇంటిబయట పడేశాడు. అనంతరం ఇంట్లో ఎలాంటి బాధ, భయం లేకుండా టీవీ చూస్తూ రాక్షసానందం పొందాడు. సైకోయిజం చూపించాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రొద్దుటూరులోని శ్రీరామ్‌నగర్‌లో ఉప్పలూరు లక్ష్మీదేవి, విజయ్ భాస్కర్ రెడ్డి దంపతులు ఇద్దరు నివసిస్తున్నారు. వీరికి కుమారుడు యశ్వంత్ కుమార్ రెడ్డి ఉన్నాడు. లక్ష్మీ దేవి గవర్నమెంట్ టీచర్ గా విధులు నిర్వహిస్తున్నారు. కుమారుడు యశ్వంత్ కుమార్ మూడేళ్ల క్రితం చెన్నైలో బీటెక్ పూర్తి చేశాడు. అనంతరం ఉద్యోగం కోసం హైదరాబాద్ కు వచ్చాడు. ఖర్చుల కోసం ప్రతి నెలా పేరెంట్స్ అతనికి డబ్బులు పంపిస్తారు. అయితే ఇటీవల ఓ రోజు తల్లికి కాల్ చేసిన యశ్వంత్ రూ.3వేలు అడిగాడు. వెంటనే పేరెంట్స్ అతనికి డబ్బులు పంపారు.
మళ్లీ యశ్వంత్ డబ్బులు పంపాలని పేరెంట్స్ కు కాల్ చేశాడు. ఈసారి రూ.10 వేలు పంపాలని తల్లిదండ్రులతో గొడవకు దిగాడు. డబ్బులు పంపకపోవడంతో యశ్వంత్ తల్లిపై కోపం పెంచుకున్నాడు. అనంతరం కుటుంబ సభ్యులకు ఎవరికీ చెప్పకుండా.. సండే మార్నింగ్ హైదరాబాద్ నుంచి పొద్దుటూరు లోని తన ఇంటికి వెళ్లాడు. ఇంట్లోకి వచ్చిన వెంటనే డబ్బులు ఎందుకు పంపలేదని గొడవకు దిగాడు.
ALSO READ: BEL Notification: బెల్ నుంచి భారీ నోటిఫికేషన్.. జీతం అక్షరాల రూ.40వేలు, దరఖాస్తుకు 2 రోజులే గడువు
గొడవ చేసిన అనంతరం తల్లిపైకి ఏకంగా దాడికి దిగాడు. తల్లి గట్టిగా అరుపులు వేయడంతో ఆ కేకలు విన్న తండ్రి వెంటనే బయటకు వచ్చే ప్రయత్నం చేశాడు. అంతలోనే తండ్రికి లోపలికి నెట్టేసి డోర్ లాక్ చేశాడు. అనంతరం కూర గాయల కత్తితో తల్లి గొంతును దారుణంగా కోశాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న లక్ష్మీ దేవిని ఈడ్చుకుంటూ వచ్చి బయట పడేశాడు. తీవ్రంగా రక్తస్రావం కావడంతో లక్ష్మీ దేవి ప్రాణాలు కోల్పోయింది. అనంతరం సైకో గాడు డోర్ వేసుకుని ఇంట్లో టీవీ పెట్టుకుని చూశాడు. చుట్టుపక్కల స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం లక్ష్మీదేవి మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.