Sree Mukhi (Source: Instragram)
1993 మే 10న తెలంగాణలోని నిజామాబాద్ లో జన్మించిన శ్రీముఖి గ్రాడ్యుయేషన్ సమయంలో దంత వైద్యం అభ్యసించింది.
Sree Mukhi (Source: Instragram)
ఇండస్ట్రీలోకి రావాలన్న ఆమె కల నెరవేర్చుకోవడానికి పటాస్ అనే టీవీ షో ద్వారా హోస్ట్ గా తన కెరియర్ ను ఎంచుకొని ఆ తర్వాత సూపర్ సింగర్ 9 అనే పాటల కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించి సక్సెస్ అందుకున్నారు.
Sree Mukhi (Source: Instragram)
త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన జులాయి సినిమాలో అల్లు అర్జున్ సోదరి రాజీ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది శ్రీముఖి. అలాగే హీరోయిన్ గా ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో పరిచయమయ్యింది.
Sree Mukhi (Source: Instragram)
రామ్ హీరోగా వచ్చిన నేను శైలజ సినిమాలో రామ్ సోదరిగా కూడా నటించిన ఈమె.. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, సావిత్రి, ధనలక్ష్మి తలుపు తడితే ఇలా పలు చిత్రాలలో నటించింది.
Sree Mukhi (Source: Instragram)
అటు హీరోయిన్ గా ఇటు నటిగా కెరియర్ లో సక్సెస్ రాకపోవడంతో బుల్లితెరపైనే సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం ఇక్కడే పలు కార్యక్రమాలకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న శ్రీముఖి.. సుమ కనకాల రేంజ్ లో పాపులారిటీ దక్కించుకోవడం గమనార్హం.
Sree Mukhi (Source: Instragram)
ఈమధ్య నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే ఈమె.. తాజాగా లెహంగా ధరించి కొంటె చూపులతో అభిమానులను ఆకట్టుకుంది.