Avika gor (Source: Instragram)
చిన్నారి పెళ్లికూతురు సీరియల్తో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న అవికా గోర్.. ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైంది.
Avika gor (Source: Instragram)
అటు చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన ఈమె ఇటు హీరోయిన్గా కూడా భారీ సక్సెస్ ను చవిచూసింది. అలా ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజుగారిగది అంటూ పలు చిత్రాలలో నటించిన ఈమె తాజాగా సెప్టెంబర్ 30న తన ప్రియుడు మిలింద్ చాంద్వానీతో ఏడడుగులు వేసింది.
Avika gor (Source: Instragram)
తనను కెరియర్ పరంగా ప్రోత్సహించిన బుల్లితెర ప్రేక్షకుల సమక్షంలోనే తాను పెళ్లి చేసుకుంటానని చెప్పిన ఈమె.. తాను హోస్టుగా వ్యవహరిస్తున్న పతి పత్నీ ఔర్ పంగా షోలో లైవ్లో వివాహం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచింది.
Avika gor (Source: Instragram)
ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. పలువురు ఈ జంటను చూసి చూడముచ్చటగా ఉన్నారు.. ఈ జంటను చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Avika gor (Source: Instragram)
అవికా గోర్ సాంప్రదాయపు రెడ్ కలర్ లెహంగా ధరించి, దీనికి ఆపోజిట్ కాంబినేషన్ లో పచ్చ రంగు రాళ్లతో పొదిగిన జువెలరీని ధరించి తన పెళ్లికూతురు గెటప్ ను ఫుల్ ఫిల్ చేసింది.
Avika gor (Source: Instragram)
అలాగే మిలింద్ లైట్ పింకిష్ కలర్ షేర్వానీ ధరించి పచ్చ రంగు పూసలతో మెడలో హారం ధరించి, పెళ్లి కొడుకుగా చాలా అందంగా ముస్తాబయ్యారు. ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Avika gor (Source: Instragram)
Avika gor (Source: Instragram)
Avika gor (Source: Instragram)