Anupama Parameswaran (7)
Anupama Parameswaran Latest Photos: ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ కిష్కింధపూరి సక్సెస్ జోష్‌లో ఉంది. పరదా వంటి డిజాస్టర్ తర్వాత ఆమె కిష్కింధపూరితో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది.
Anupama Parameswaran (8)
దీంతో ఈ భామ ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ఆస్వాధిస్తోంది. వరుసగా ఇంటర్య్వూలో, ప్రెస్ మీట్స్, సక్సెస్ మీట్‌తో బిజీగా ఉంది. ఇందులో భాగంగా వరుసగా ఫోటోషూట్‌లో పాల్గొంది.
Anupama Parameswaran (9)
ఈ క్రమంలో తాజాగా అనుపమ తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. చుడిదార్‌లో గ్లామరస్ లుక్‌తో ఈ హాట్ బ్యూటీ కనువిందు చేసింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Anupama Parameswaran (10)
ప్రేమమ్‌తో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ భామ తెలుగులో ఆఆ, శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగి, రాక్షసుడు వంటి చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంది. దీంతో ఈ భామ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాబితాలో చేరింది.
Anupama Parameswaran (11)
ఆ తర్వాత నటించిన బటర్ ఫ్లై, ఈగల్, రౌడీ బాయ్స్ చిత్రాలతో డిజాస్టర్స్ చూసింది. దీంతో ఈ అమ్మడికి ఆఫర్స్ తగ్గిపోయాయి. అప్పటి వరకు సంప్రదాయంగా కనిపించిన అనుపమ రౌడీ బాయ్స్‌లో రెచ్చిపోయి గ్లామర్ షో చేసింది.
Anupama Parameswaran (12)
అంతేకాదు అప్పటి వరకు బోల్డ్స్ సీన్స్‌కి హద్దులు పెట్టుకున్న ఆమె రౌడీ బాయ్స్‌తో వాటిని చెరిపేసింది. ఇందులో హీరోతో ముద్దు సీన్లో నటించిన సెన్సేషన్ అయ్యింది. ఆ తర్వాత టిల్లు స్క్వేర్‌లో గ్లామర్‌నే నమ్ముకుంది.
Anupama Parameswaran (13)
ఇందులో బోల్డ్ రోల్ చేసింది. ఇందులో ఆమె లుక్‌కి మంచి మార్కులు పడ్డాయి. టిల్లు స్క్వేర్ కూడా బ్లాక్‌బస్టర్ హిట్. కానీ ఆ క్రిడెట్ హీరో ఖాతాలోకే వెళ్లింది. ఆ తర్వాత పరదాతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఉమెన్ సెంట్రిక్ జానర్‌తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
Anupama Parameswaran (14)
దీంతో బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం బోల్తా కొట్టింది. ఆ తర్వాత బెల్లంకొండ హీరోతో జతకట్టి కిష్కింధపూరి వంటి హారర్ మూవీతో వచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. దీంతో లాంగ్ గ్యాప్ తర్వాత మంచి హిట్ పడటంతో అనుపమ ఫుల్ ఖుషిలో ఉంది.