OTT Movie : డిజిటల్ స్ట్రీమింగ్ లో ఎన్నో ప్రేమ కథలు ఉన్నాయి. ఒక్కోటి ఒక్కో విధంగా మనల్ని ఎంటర్టైన్ చేస్తుంటాయి. కొన్ని ప్రేమ కథలు రియాలిటీకి దగ్గరగా కూడా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హాలీవుడ్ ప్రేమ కథ, ఒక జంట అనుకోని పరిస్థితుల్లో విడిపోయాక
మొదలవుతుంది. ప్రాణంగా ప్రేమించుకున్న వీళ్ళ ప్రేమ కథ ఊహించని మలుపులు తిరుగుతుంది. ఈ సినిమా దర్శకుడు తన నిజ జీవితంలోని లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ అనుభవాల ఆధారంగా ఈ కథను రూపొందించారు. రొమాంటిక్ మూవీ లవర్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘లైక్ క్రేజీ’ (Like crazy) అనే ఈ రొమాంటిక్ సినిమా డ్రేక్ డోరేమస్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో ఫెలిసిటీ జోన్స్ (అన్నా), అంటన్ యెల్చిన్ (జేకబ్), జెన్నిఫర్ లారెన్స్ (సామంతా), చార్లీ బెవ్లీ (సైమన్) ప్రధాన పాత్రల్లో నటించారు. 2011 అక్టోబర్ 28న విడుదలైన ఈ సినిమా, ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), గూగుల్ ప్లే మూవీస్ (Google Play Movies) లో రెంటల్ పద్దతిలో అందుబాటులో ఉంది. ఈ సినిమాకి సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో గ్రాండ్ జ్యూరీ ప్రైజ్ కూడా వరించింది.
అన్నా అనే బ్రిటిష్ అమ్మాయి అమెరికాలో చదువుకుంటోంది. జేకబ్ అనే అమెరికన్ అబ్బాయి కాలేజీలో ఆమెకు పరిచయమవుతాడు. ఇద్దరూ త్వరగానే ప్రేమలో పడతారు. రాత్రులు కలిసి గడుపుతారు, ఒకరినొకరు వదలలేమని అంటారు. ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటారు. వారిద్దరూ కలిసి సంతోషంగా సమయం గడుపుతారు. అయితే అన్నా తన విద్యార్థి వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికాలోనే ఉండిపోవాలని నిర్ణయించుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత ఆమె తన సోదరి పెళ్లికి ఇంగ్లాండ్‌కు తిరిగి వెళుతుంది.
ఆ పెళ్లి జరిగిన తరువాత తిరిగి అమెరికాలోకి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు, ఆమె వీసా నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా అమెరికాలో ఆమె ప్రవేశాన్ని నిరాకరిస్తారు. దీంతో వీళ్ళు అనుకోకుండా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌ను కొనసాగించాల్సి వస్తుంది. అన్నా లండన్‌లో, జాకబ్ లాస్ ఏంజిల్స్‌లో ఉండిపోతారు. ఈ దూరం వీళ్ళ బంధాన్ని, వాళ్ళ ఎమోషన్స్ ని ప్రభావితం చేస్తుంది. వీళ్ళు ఒకరికి తెలీకుండా మరొకరు రిలేషన్ పెట్టుకుంటారు. ఈ క్రమంలో స్టోరీ ఆసక్తికరంగా నడుస్తుంది. చివరికి వీళ్ళప్రేమ ఎలాంటి టర్న్ తెసుకుంటుంది ? వీళ్ళ జీవితాలు ఎలా మారిపోతాయి ? అనే విషయాలను, ఈ రొమాంటిక్ సినిమాను చూసి తెలుసుకోండి.